newssting
Radio
BITING NEWS :
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్‌ క్రాష్‌ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్‌ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. * తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దుబ్బాక, హుజురాబాద్‌ ఓటమితో కేసీఆర్‌ మానసిక స్థితి దెబ్బతిందని విమర్శించారు. * చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. * ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ పిల్‌ దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్‌ దాఖలు చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ పిటిషనర్‌ కోరారు. సినిమా విడుదలపై కూడా స్టే ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.

ఎంపీ కేశినేని నాని ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడానికి గల కారణం..?

25-09-202125-09-2021 15:49:22 IST
2021-09-25T10:19:22.866Z25-09-2021 2021-09-25T10:18:24.368Z - - 19-01-2022

ఎంపీ కేశినేని నాని ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడానికి గల కారణం..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయవాడ ఎంపి, తెలుగుదేశం నాయకుడు కేశినేని నాని ఇక తాను ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించి బెజవాడ రాజకీయాలని వేదేక్కించారు. తానే  కాదు తన కుమార్తె కూడా పోటీచేయబోదని, ఇప్పటికే తన కుమార్తె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్నీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి తెలిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీచేయకపోయినా పార్టీలోనే కొనసాగుతానని నాని చెప్పినట్లు తెలుస్తోంది. 

వచ్చే ఎన్నికల్లో తాను పార్టీ తరఫున పోటీచేయబోనని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు స్పష్టంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం చంద్రబాబును కలిసినప్పుడు తన బదులు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మరొకరిని చూసుకోవాలని ఆయన చెప్పినట్లు సమాచారం. కొద్దికాలంగా నాని పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

చంద్రబాబు విజయవాడలో పర్యటించినా తనకు సంబంధంలేనట్లు వ్యవహరించారు. విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో చంద్రబాబు తనను అవమానించినట్లు నాని భావిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, మరో నేత నాగుల్‌ మీరా గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో తనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా చంద్రబాబు వాళ్లనే సమర్థించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని అందుకే ఇక ఎన్నికలలో పోటీ చేయననే నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేష్ లో అధికార వైసిపి పార్టీ దెబ్బకి పూర్తిగా చతికిల పడిపోయిన టిడిపి కి ఇలా సీనియర్ నాయకులు సైతం పార్టీ లో అంటీ ముట్టనట్లు ఉంటామని ప్రకటించడంతో టిడిపి పార్టీ కి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్‌

మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్‌

   5 hours ago


పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ ఎంపిక... టెలివోట్‌లో 93% స్కోర్

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ ఎంపిక... టెలివోట్‌లో 93% స్కోర్

   8 hours ago


కొడాలి నానిపై టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆరోపణలు

కొడాలి నానిపై టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆరోపణలు

   9 hours ago


కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్‌

కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్‌

   13 hours ago


పంజాబ్‌లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు గట్టి దెబ్బ.. మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి మేనల్లుడు

పంజాబ్‌లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు గట్టి దెబ్బ.. మైనింగ్ కేసులో ముఖ్యమంత్రి మేనల్లుడు

   13 hours ago


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కరోనా పాజిటివ్

   17 hours ago


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కరోనా పాజిటివ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కరోనా పాజిటివ్

   17-01-2022


ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

   15-01-2022


విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం

విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం

   14-01-2022


తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వైఎస్‌ జగన్‌

తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వైఎస్‌ జగన్‌

   14-01-2022


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle