నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
23-01-202123-01-2021 22:48:47 IST
Updated On 23-01-2021 22:43:41 ISTUpdated On 23-01-20212021-01-23T17:18:47.844Z23-01-2021 2021-01-23T17:11:47.133Z - 2021-01-23T17:13:41.048Z - 23-01-2021

ఏపీలో పంచాయితీ ఎన్నికల రచ్చ కాస్త రాజకీయ రొచ్చుగా మారిందని భావించాల్సి వస్తుంది. ఒకపక్క ఎన్నికల కమిషనర్ తన పని తాను చేసుకుంటూ పోవాలని గట్టిగా ఆరాటపడుతుంటే.. ప్రభుత్వం కూడా అంతే గట్టిగా ఎన్నికలు నిర్వహించనే కూడదని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రభుత్వం ఏం చేస్తుందా అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కమిషనర్ నిమ్మగడ్డ మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగులు.. ఇతర ఉన్నతాధకారులు తనకు సహకరించడం లేదని గొడెళ్ళబోసుకుంటోనే.. ఎన్నికల నిర్వహణలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఇక, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు యధావిధిగా మళ్లీ నోళ్లకు పని చెప్తూ రమేష్ కుమార్ పై ఘాటు విమర్శకులు దిగారు. నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ కాదని రాజకీయ నాయకుడిగా.. చంద్రబాబు మెప్పు పొందేందుకు తెగ ఆరాటపుతున్నారనీ విమర్శించారు.
నిమ్మగడ్డ రమేష్ ప్రెస్ మీట్ చూస్తే తనకు చాలా ఆశ్చర్యం వేసిందనీ.. ఆయన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారు. గతంలో గోపాల కృష్ణ ద్వీవెది ఎంత పకడ్బందిగా ఎన్నికలు నిర్వహించారో అందరికీ తెలుసని.. నిమ్మగడ్డ రమేష్ వ్యక్తిగత స్వార్థం, పరిచయాల కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఎవరి కోసం ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారో రమేష్ కుమార్ చెప్పాలన్నారు. గతంలో మేము ఎన్నికలు పెట్టమంటే ఎందుకు పెట్టలేదని.. చంద్రబాబు మీ స్నేహితుడని, సామాజికవర్గమని ఎన్నికలు పెట్టలేదా... ఇప్పుడు ఈ ఎన్నికలు మీకు పదవిచ్చిన చంద్రబాబు మెప్పు పొందడానికా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలు పెడితే చంద్రబాబుకు పది శాతం సీట్లు కూడా రావు. నిమ్మగడ్డ ప్రచారం చేసినా కూడా రావు. ఏకగ్రీవాలయితే వాటిపై దృష్టి పెడతాం అనడంలో ఆయన దురుద్దేశమే ఉందో అర్థమవుతోంది.
నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబుతో లాలూచి పడ్డాడనీ.. ఎన్నికలు మూడు నెలల వాయిదా వేయడం వల్ల ఏలాంటి నష్టం లేదనీ.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేయడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. రాజ్యంగ వ్యవస్థలో నిమ్మగడ్డ లాంటి వ్యక్తులు ఉండటం చాలా దురదృష్టమని.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ప్రభుత్వ నిర్ణయముంటుందనీ చెప్పారు. రాష్ట్రంలో ప్రతి విషయానికి చంద్రబాబు అల్లకల్లోలం సృష్టిస్తుంటే.. లోకేష్ ఇంట్లో కూర్చోని ఊసులాడుకుంటున్నారనీ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
2 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
2 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
4 hours ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
19 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
21 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
a day ago
ఇంకా