newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

పూర్తిగా బీహార్ లా మారిన ఆంధ్రప్రదేశ్

31-01-202131-01-2021 08:15:22 IST
2021-01-31T02:45:22.853Z31-01-2021 2021-01-31T02:45:18.117Z - - 04-03-2021

పూర్తిగా బీహార్ లా మారిన ఆంధ్రప్రదేశ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు మామూలు హీట్ మీద లేవు. అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తుందంటూ.. ప్ర‌తి ప‌క్షాలు ఎన్ని కామెంట్లు చేసినా.. ప్ర‌భుత్వంలో ఎలాంటి మార్పూ లేక‌పోవడం.. ఆఫీస‌ర్లంతా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు.. సైలెంట్ గా ఉండ‌డంపై ఎన్నో కామెంట్స్ ఉన్న‌య్. జ‌నంలో ఏదో ఒక తెలీని భ‌యం మొద‌లైంది. ఇప్పుడు ఎన్నిక‌ల టైంలో అయితే.. తెలీని భ‌యం కాదు. డేంజ‌ర్ రా నాయ‌నా.. త‌లొంచుకుని న‌డిచినా.. త‌ప్పేలా లేవు కష్టాలు అని టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. త‌మ మానాన తాము బ‌తుకుతున్నా.. వైసీపీ వాళ్లు దాడుల‌కు దిగుతున్నార‌నే ఆరోప‌ణ‌లు బానే ఉన్న‌య్. చ‌ట్ట  ప‌రంగా కూడా త‌మ‌కు ఎలాంటి న్యాయం జ‌ర‌గ‌డం లేదు అని.. టెన్ష‌న్ తో సైలెంట్ అయిపోతున్నారు జ‌నాలు.

ఇక  ఏపీలో జ‌రుగుతున్న ఎవ్వారంపై టీడీపీ లీడ‌ర్.. నారా లోకేశ్ సీరియ‌స్ అయ్యారు. అస‌లు ఏం జ‌రుగుతుంది ఏపీలో అని ప్ర‌శ్నిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను.. అచ్చం బీహార్ లా మారుస్తున్నార‌ని ఆగ్ర‌హంగా ఉన్నారు నారా లోకేశ్. జ‌నాల‌కి ర‌క్ష‌ణ లేకుండా పోయింది అని.. ట్వీట్ చేశారు లోకేశ్. గ‌న్ కంటే ముందే జ‌గ‌న్ వ‌స్తారు అని అప్ప‌ట్లో జ‌నాల్ని మ‌భ్య పెట్టారు క‌దా. ఇప్పుడు జ‌గ‌న్ కంటే ముందే గ‌న్ లు వ‌స్తున్నాయి అంటూ కామెంట్ చేశారు లోకేశ్. ఏపీలో పెరిగిపోతున్న ఇసుకాసురుల బెదిరింపుల‌పై సీరియ‌స్ అయ్యారు. రాజ‌కీయాలు ఇసుక మాఫియా చుట్టూ తిరుగుతున్నాయ‌ని.. ఇసుక మాఫియాలో ఉన్న‌న్ని బెదిరింపులు ఎక్క‌డా లేవ‌న్నారు లోకేశ్. భ‌వ‌న కార్మికుల పొట్టగొట్టిన పాపం వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఊరికే వ‌దిలిపెట్ట‌దు అని ఆరోపించారు టీడీపీ లీడ‌ర్. 

శ్యాండ్ మాఫియాని చూస్తుంటే.. ముంబై, బీహార్ మాఫియాలా మారిపోయింది అనే విష‌యం అంద‌రికీ అర్దం అయింది. ఏపీలో పెరుగుత‌న్న గ‌న్ క‌ల్చ‌ర్ చూస్తుంటే జ‌నంలో టెన్ష‌న్ పెరిగిపోయింది. ఇసుకాసురుల గురించి కామెంట్స్ చేసిన నారాలోకేశ్.. గ‌న్నుల‌తో బెదిరిస్తున్న వీడియో షేర్ చేయ‌డంతో హాట్ టాపిక్ అయింది వ్య‌వ‌హారం. ఇది ఆంధ్ర‌ప్ర‌దేశా.. లోకేశ్ అన్న‌ట్లు.. బీహారేనా అని టెన్ష‌న్ ప‌డుతున్నారు జ‌నాలు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle