newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

లొంగిపోయిన కూన రవికుమార్

15-04-202115-04-2021 22:18:09 IST
2021-04-15T16:48:09.096Z15-04-2021 2021-04-15T10:22:50.324Z - - 15-05-2021

లొంగిపోయిన కూన రవికుమార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏడు రోజులుగా అజ్ఞాతంలో వున్న టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పొందూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం లొంగిపోయారు. పోలీసులు రాజాం కోర్టుకు తరలించారు. రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవికుమార్‌కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజాం కోర్టుకు తరలించారు. పరిషత్ ఎన్నికల పోలింగ్‌ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై అనుచరులతో కలిసి కూన రవికుమార్‌ దాడి చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదయ్యింది. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే కూన వెళ్లిపోయారు.

పరిషత్ ఎన్నికల రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త మురళీకృష్ణపై కూన రవి కుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కూన రవి కుమార్ అక్కడ ఉండగానే ఆ సంఘటన చోటు చేసుకుంది. దానికితోడు కూన రవి కుమార్ పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మురళీకృష్ణ పొందూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు రవికుమార్ గత ఏడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా అజ్ఞాతాన్ని వీడి ఆయన పోలీసులకు లొంగిపోయారు. కోర్టులో కూన రవికుమార్ ను హాజరుపరిచే నేపథ్యంలో రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవికుమార్ కు వైద్యులు కరోనా వైద్య పరీక్షలను నిర్వహించారు . అనంతరం ఆయనను కోర్టుకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల సందర్భంగా పెనుబర్తి అలజడికి కారణం అయ్యాడని పోలీసులు కూన రవికుమార్ పై కేసు నమోదు చేశారు. గత పరిషత్ ఎన్నికల సమయంలో పెనుబర్తి లో టీడీపీ నేతలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారని, ఈ విషయం తెలిసిన కూన రవికుమార్ పెనుబర్తి వెళ్లగా దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టి కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారని టిడిపి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. కూన రవికుమార్ పై రాజకీయ కక్షలతోనే కేసులు పెట్టారని అంటున్నారు. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle