newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

13-04-202113-04-2021 17:31:45 IST
Updated On 14-04-2021 11:43:32 ISTUpdated On 14-04-20212021-04-13T12:01:45.427Z13-04-2021 2021-04-13T11:12:23.803Z - 2021-04-14T06:13:32.844Z - 14-04-2021

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఇటీవలి కాలంలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు పులివెందులలోని వివేకా ఇంటిని సోమవారం నాడు మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన గది, బాత్రూంను జల్లెడ పట్టారు. వివేకా ఇంటిని సీబీఐ అధికారులు దాదాపు 3 గంటల పాటు పరిశీలించారు. వివేకా పీఏ హిదయతుల్లాను ప్రశ్నించారు. వివేకా ముఖ్య అనుచరుడు యర్ర గంగిరెడ్డిని కూడా సీబీఐ బృందం నిశితంగా ప్రశ్నించింది. వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దోషులెవరో తేల్చాలని కోరారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టిన కొన్నిరోజుల్లోనే సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చారు. 

ఈ కేసు విచారణకు సంబంధించిన ఆధారాలను చెరిపేశారని మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే హంతకులను పట్టుకోలేకపోతున్నామని తెలిపారు. వైఎస్ వివేకా హత్య జరిగిన మూడు నెలల వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని కొడాలి నాని అన్నారు. అప్పుడు ఈ హత్య కేసు నిందితులను పట్టుకోకుండా ఇప్పుడు సీఎం జగన్‌పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. 

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఆధారాలను చెరిపేశారు. అందువల్లే హంతకులను పట్టుకోలేకపోతున్నాం. హత్య జరిగిన మూడు నెలల వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అప్పుడు హంతకులను పట్టుకోకుండా ఇప్పుడు జగన్‌పై నిందలు వేస్తున్నారని కొడాలి నాని అన్నారు. తన తండ్రి హత్య జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు దోషులను పట్టుకోకపోవడంపై ఇటీవల సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసును సీబీఐ విచారిస్తుండటంతో ఢిల్లీలోని సీబీఐ అధికారులను ఆమె కలిశారు. తన తండ్రిని ఎవరు హత్య చేశారో ఇప్పటికీ తెలియదని వ్యాఖ్యానించారు. నాన్న హత్య మిస్టరీగానే మిగిలిపోయిందని అన్నారు. ఈ కేసులో న్యాయం కోసం ఇంకెన్ని రోజులు ఎదురుచూడాలని సునీత అన్నారు. దోషులను పట్టుకోకపోతే ఈ కల్చర్ ఇలాగే పెరిగిపోతుందని అభిప్రాయపడ్డారు. తాజాగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle