newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. గడ్కరీ మద్దతు

17-10-202017-10-2020 12:12:28 IST
2020-10-17T06:42:28.742Z17-10-2020 2020-10-17T06:41:56.922Z - - 25-10-2020

ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. గడ్కరీ మద్దతు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్‌లను జాతికి అంకితం చేయడంతో పాటు రాష్ట్రంలో రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు భూమి పూజ, శిలాఫలకాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. 

శుక్రవారం నాగపూర్‌ నుంచి గడ్కరీ, ఢిల్లీ నుంచి కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్‌ జనరల్‌ వీకే సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ చేసిన పలు ప్రతిపాదనలపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు. దాదాపు రూ.7,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. 

ఏపీలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం సంతోషం

ఏపీలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 2014లో మేము అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ఈ అయిదేళ్లలో కొత్తగా 2,667 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. రాష్ట్రంలో రూ.8,869 కోట్లతో మొత్తం 28 ప్రాజెక్టులు చేపడుతున్నాం. 2,209 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.32,175 కోట్లు వ్యయం కానుంది. వీటికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తుది దశలో ఉంది. వచ్చే ఏడాదిలో పనులు మొదలవుతాయని తెలిపారు.

రూ.5 వేల కోట్లకు పైగా వ్యయం అయ్యే బెంగళూరు–చెన్నై హైవే ఏపీకి ఎంతో కీలకం. పోర్టు కనెక్టివిటీకి కూడా ప్రాధాన్యం ఇస్తాం. ఆ జాబితా ఇప్పటికే మా దగ్గర ఉంది. ఆ మేరకు పనులు చేపడతాము. అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే పనులు నాలుగు జిల్లాలలో కొనసాగుతాయి. అదే విధంగా విజయవాడ ఔటర్‌ రింగ్‌ రోడ్డు కూడా చేపడదాం. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి మీరు (సీఎం జగన్‌) ఢిల్లీకి రండి. అక్కడ అన్నీ చర్చిద్దాం అని గడ్కరీ అభయహస్తం ఇచ్చారు. భూసేకరణలో మీ వాటా 50 శాతం కొంత భారం అంటున్నారు కాబట్టి, రోడ్డు నిర్మాణంలో వాడే వాటి మీద మైనింగ్‌ సెస్‌ లేక రాయల్టీ, స్టీల్, సిమెంట్‌ వంటి వాటిపై జీఎస్టీలో మినహాయింపు ఇవ్వండి. తద్వారా కేంద్రంపై ప్రాజెక్టు భారం కాస్త తగ్గుతుందని మంత్రి సలహా ఇచ్చారు. 

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ఇవాళ దేశానికే గర్వకారణం. నేను కూడా చూశాను. అమ్మవారిని దర్శించుకున్నానని మంత్రి సంతోషం ప్రకటించారు. కొత్తగా ప్రారంభించనున్న అన్ని ప్రాజెక్టుల ద్వారా ఏపీ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఏపీలో మరింత ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తాం. ఎంఎస్‌ఎంఈ, ఖాదీ పరిశ్రమలకు మేము పూర్తి అండగా నిలుస్తాం. ఎంఎస్‌ఎంఈ మంత్రిగా చెబుతున్నాను. చేనేత, హస్తకళల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఇక్కడ వాటికి కొదవ లేదని గడ్కరీ చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న పోర్టులు కూడా అభివృద్ధిలో ఎంతో దోహదం చేస్తున్నాయి. మీ (సీఎం) విజ్ఞప్తులకు పూర్తి అండగా నిలుస్తాం. వచ్చే నెలలో నేను ఢిల్లీకి వస్తాను. మీరూ, అధికారులు రండి. మీ ఎంపీలు కూడా నన్ను కలుస్తున్నారు. మీరు ఢిల్లీకి వస్తే, అన్నీ మాట్లాడుకుందాం. సమస్యలు పరిష్కరించుకుందాం అని గడ్కరీ తెలిపారు.

కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభ కార్యక్రమంలో వీడియో ద్వారా కేంద్ర జాతీయ రహదారుల శాఖ సహాయమంత్రి వీకే సింగ్, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దేశంలో అనేక రహదారుల నెట్‌వర్క్‌కు ఆంధ్రప్రదేశ్‌ హబ్‌గా ఉంది. దీని వల్ల రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని వీకే సింగ్ చెప్పారు. 

ఏపీలో ఇవాళ ఒక మైలు రాయి 

నితిన్‌ గడ్కరీ నేతృత్వంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. ఏపీలో ఇవాళ ఒక మైలు రాయి. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వల్ల విజయవాడలో ట్రాఫిక్‌ సమస్య చాలా వరకు తొలగిపోతుంది. రాష్ట్రంలో ఇంకా చాలా కేంద్ర సంస్థలు ఏర్పాటవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని ఎంతో కృషి చేస్తున్నారు. ఇందుకు మంత్రి గడ్కరీ ఎంతో సహకరిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు అని జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle