జగన్ చేతిలో మళ్లీ చంద్రబాబుకు చావుదెబ్బే: జేసీ షాకింగ్ కామెంట్స్
17-01-202117-01-2021 10:09:58 IST
2021-01-17T04:39:58.956Z17-01-2021 2021-01-17T03:17:40.112Z - - 04-03-2021

జేసీ దివాకర్ రెడ్డి.. ఈ తెలుగుదేశం పార్టీ నేత ఎప్పుడు చూసినా తన చేష్టలతో, తన మాటలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సంచలన వ్యాఖ్య అన్నది ఆయన నోటి నుండి జాలువారుతూనే ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ ను ఓ వైపు మావాడే అంటూ వ్యాఖ్యలు చేసుకుంటూ రావడం కూడా అప్పట్లో సంచలనం అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వెళుతున్నారు.
తాజాగా కూడా చంద్రబాబు నాయుడు తీరును తప్పుబడుతూ జేసీ దివాకర్ రెడ్డి కామెంట్లు చేశారు. అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఇంకా చంద్రబాబు అదే వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఏదైనా సూటిగా సుత్తిలేకుండా డైరెక్టుగా చెప్పకుండా గంటల తరబడి సాగదీయడం చంద్రబాబుకు అలవాటని అంటున్నారు జేసీ. అది మార్చుకుంటేనే టీడీపీ బాగు పడుతుందని.. అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే అధికారులతో సమీక్షలు, చర్చల పేరుతో సమయం వృధా చేసేవారని జేసీ విమర్శించారు. ఇప్పటికీ ఆ పద్ధతి మారలేదని.. పది నిమిషాల్లో ముగించే ప్రసంగాన్ని వంద నిమిషాలు చేస్తున్నారని, ఇలా టైమ్ వేస్తున్నారని మండిపడ్డారు. తనను కలిసేందుకు ఎవరైనా వస్తే వారి యోగక్షేమాలు, కుటుంబం బాగోగుల గురించి చంద్రబాబు ఏ రోజూ అడగలేదని జేసీ అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి వాళ్లను ఎవరైనా కలవడానికి వెళితే వారు భుజంపై చెయ్యేసి కుటుంబం వివరాలు, యోగక్షేమాలు, ఆరోగ్యం బాగోగులు అన్ని తెలుసుకుని ఆ తర్వాత ఏ పని మీద వచ్చారనే విషయాన్ని అడిగేవారని జేసీ అన్నారు. అలాంటి అలవాటు చంద్రబాబు వద్ద అసలు తాను ఎప్పుడూ చూడలేదని జేసీ అంటున్నారు. ఎవరైనా వస్తే ఆయనకు నచ్చితే పలకరిస్తారని, నచ్చకపోతే వెళ్లిపోతారని ఆరోపించారు. ఈ విషయం తాను చంద్రబాబుకు కూడా చాలా సార్లు వ్యక్తిగతంగా, బహిరంగంగానే చెప్పానని జేసీ అన్నారు. అయినా ఇంకా ఆయనలో మార్పు రాలేదన్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు అత్యంత సీనియర్ అని, అయినా ఆయన ఇప్పటికీ తన వైఖరి మార్చుకోలేదని.. ఆయనలో ముందు ముందు మార్పు వస్తుందన్న నమ్మకం లేదని తాజాగా ఓ ఇంటర్యూలో జేసీ కామెంట్ చేశారు. అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పటికైనా మారకుంటే.. మళ్లీ జగన్ చేతిలో చావు దెబ్బ తినక తప్పదని దివాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోని అందరి మనసులోనూ ఇదే మాట ఉందని జేసీ అన్నారు. అయితే తాను మాత్రం బయటకు చెబుతున్నానని చెప్పారు.

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
14 minutes ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
36 minutes ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
2 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
2 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
3 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
3 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
16 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
17 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
21 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago
ఇంకా