ఒంటరి పోరాటం.. వర్కవుట్ అయ్యేనా
23-02-202123-02-2021 15:00:26 IST
Updated On 23-02-2021 09:58:24 ISTUpdated On 23-02-20212021-02-23T09:30:26.265Z23-02-2021 2021-02-23T04:25:38.027Z - 2021-02-23T04:28:24.504Z - 23-02-2021

ఒంటరి పోరాటం. అదే కరెక్ట్. పవన్ ఇప్పటికైనా తెలుసుకోవాలి. రెండు పడవలపై కాళ్లేయడం వేస్ట్.. ఒంటరిగా ఫైట్ చేస్తే.. ఫలితం వస్తుంది. ఇదీ.. జనసేనలో ఇప్పుడు వినిపిస్తోన్న మాట. పంచాయితీ ఎన్నికల తర్వాత వారి లెక్కలు మారిపోయాయి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జనసేనకి మంచి బలం ఉందనే విషయాన్ని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. ఒంటరిగా ఫైట్ చేస్తే.. జిల్లా జిల్లా పెంచుకుంటూ పోవచ్చు అనేది వారి నమ్మకం. పంచాయితీ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో సీట్లు ఓట్లు రావడంతో లోకల్ లీడర్లలో కాన్ఫిడెన్స్ పెరిగింది. కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం.. ఆ విధంగా డేర్ చేయలేక పోతున్నారు అనే విషయం క్లారిటీగానే ఉంది. బీజేపీతో ఏపీలో ఒరిగేది ఏమీ లేదు అని.. మిగతా లీడర్లు అంటున్నా.. బీజేపీ వేలు పట్టుకుని వీలున్నప్పుడల్లా నడుస్తూనే ఉన్నారు పవన్ కల్యాణ్. జనసేన అధినేతగా.. ఆ పార్టీకి సరైన నాయకత్వం వహించడం లేదు అంటూ.. ఫీలైపోతున్నారు మిగతా లీడర్లు. పైగా ఒక్క పవన్ కల్యాణ్ తప్ప.. అసలు మాస్ లీడర్లే లేకపోవడంతో.. కార్యకర్తలు బాగా డిసప్పాయింట్ అవుతున్న మాట నిజమే. కానీ.. మాస్ లీడర్లు లేకున్నా.. మాస్ గా ఎదిగే లీడర్లు వస్తారు. ముందు మనం ఒంటరి ప్రయాణం చేద్దాం. వీలైనంత త్వరగా బీజేపీ దోస్తీ వదిలేద్దాం అనేది జనసేన లీడర్ల ఇంటెన్షన్. ఇప్పటికైనా పవన్ తేరుకుని.. రియలైజ్ అయ్యి.. పోరు సాగించాలని మిగతా లీడర్లు కోరుతున్నారు. గ్రామస్థాయిలో కూడా అదే కనిపించింది. ఎందుకంటే.. పంచాయితీ ఎన్నికల్లో ఒంటరి ప్రయాణంతోనే ఇన్ని సర్పంచ్ సీట్లు సాధించాం అంటున్నారట. మరి అధినాయకుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ విషయంపై ఆలోచిస్తారో లేదో అనే డౌట్లు.. వారికే ఉన్నయ్. అంతే కాదు. ఏదో నాలుగు సర్పంచ్ సీట్లు గెలిచినంత మాత్రాన.. పార్టీ బలంగా ఉంది అనుకోవడం కరెక్ట్ కాదు అనే వాళ్లూ ఉన్నారు. అసలే పవన్ కల్యాణ్ పార్టీని నమ్ముకుని లేరు. ఎప్పుడు పాలిటిక్స్ అంటారో.. ఎప్పుడు షూటింగ్ లు అంటారో తెలీని టైంలో.. ఒంటరి పోరాటం కరెక్ట్ కాదు అనే వాళ్లూ బానే ఉన్నారు.

ఎమర్జెన్సీపై రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. జవదేకర్ ఎద్దేవా
8 hours ago

ఆత్మహత్యకు ప్రయత్నించిన మాగంటి బాబు కుమారుడు
9 hours ago

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
10 hours ago

బీజేపీకి రైతుల పాపం ఊరికే పోతుందా
2 hours ago

గ్రేటర్ మేయర్ ప్రేమ, అభిమానం కోసం.. నేను కుక్కలా పుడతా- వర్మ
9 hours ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
10 hours ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
12 hours ago

స్టాలిన్ ని ఓడిస్తా అంటున్న హిజ్రా
5 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
12 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
13 hours ago
ఇంకా