newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

17-04-202117-04-2021 11:05:53 IST
Updated On 17-04-2021 11:48:01 ISTUpdated On 17-04-20212021-04-17T05:35:53.764Z17-04-2021 2021-04-17T03:39:54.739Z - 2021-04-17T06:18:01.005Z - 17-04-2021

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వింటుంటే కాస్త క‌ష్టంగానే  ఉంది క‌దా. జ‌న‌సేన పార్టీ కాదా.. ఆ పార్టీకి సెప‌రేట్ గుర్తు ఉండ‌కూడ‌దా. మ‌రీ ఇంత‌లా మాట్లాడ‌తారా.. ఎవ‌రు ఆ మాట అన్న‌ది. మా భ‌క్తుల‌కి వ‌దిలేస్తే.. వాళ్ల ప‌ని ఉందే. ఏమ‌నుకుంటున్నారో ఏమో. అని.. జ‌న‌సేన వాళ్లు ఫీల్ అవ‌డం కామ‌నే. కానీ.. రూల్స్ అలా ఉండ‌వ్ క‌దా మ‌రి. ఎన్నిక‌ల సంఘం ఎవ్వారం వేరేలా ఉంటుంది.  మ‌న‌కున్న‌న్ని ఎమోష‌న్స్.. ఎన్నిక‌ల సంఘానికి ఉండ‌వు. అక్క‌డ అన్నీ లెక్క‌లు ఎక్కాలు.. చ‌ట్టాలూ రూల్సూ ఉంట‌య్ అంతే. 

ఇప్పుడు జ‌న‌సేన ప‌రిస్థితి కూడా ఎన్నిక‌ల సంఘం దెబ్బ‌కి గుక్క తిప్పుకోకుండా అయిందంట‌. టాక్ అయితే అలా ఉంది మ‌రి. అస‌లు టాకేంద‌య్యా అంటే. ఇక జ‌న‌సేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉండ‌క‌పోవ‌చ్చు. అదే క‌నిపిస్తోంది. ఆల్రెడీ గాజు గ్లాసు గుర్తు వేరే పార్టీకి వెళ్లిపోయింది ఏపీలో. జ‌న‌సేన ఎలాగూ పోటీ చేయ‌డం లేదు. అప్పుడెప్పుడో పోటీ చేసింది. అంతే కానీ.. అంత‌కు ముందూ చేయ‌లేదు.. ఆ త‌ర్వాత కూడా చేయ‌లేదు. య‌ట్ లీస్ట్.. ఈ తిరుప‌తి ఎన్నిక‌ల్లో అయినా పోటీ చేస్తే వేరేలా ఉండేది. ఇక్క‌డ కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప‌వ‌ర్ స్టార్ లా కాకుండా.. స‌పోర్టింగ్ స్టార్ లా ఉండిపోయారు కదా పాలిటిక్స్ లో. అందుకే.. ఆ గాజు గ్లాసు గుర్తు తిరుప‌తి ఎన్నిక‌ల్లో వేరే పార్టీకి చేరిపోయింది. సో.. ఇక్క‌డ ఇక ద‌క్క‌క పోవ‌చ్చు.

పవన్ కళ్యాణ్ కు కరోనా.. ఆందోళనలో జనసైనికులు

పోనీ మ‌రో తెలుగు రాష్ట్రం తెలంగాణ‌లో అయినా ఉంటుంది అనుకుంటే అక్క‌డ కూడా ఎదురు దెబ్బే త‌గిలిందంట‌. ఖ‌మ్మం వ‌రంగ‌ల్ తో పాటు మ‌రికొన్ని చోట్ల‌.. మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గబోతున్న‌య్ క‌దా. అక్క‌డైనా గాజు గ్లాసు గుర్తు ఇస్తారు అనుకుంటే.. జ‌న‌సేన‌కి సెప‌రేట్ గుర్తు ఉండేంత అర్హ‌త లేదు అని ఎన్నిక‌ల సంఘం తేల్చేసిన‌ట్లు టాక్ వ‌స్తోంది. ఎందుకంటే.. ఇక్క‌డ కూడా అంతే క‌దా. మొన్న గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు.. త‌ర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ఇక ఇప్పుడు మాత్రం ఎలా వ‌స్తుంది చెప్పండి  గుర్తు. అందుకే.. తెలంగాణ‌లో కూడా ఒక వేళ పోటీ చేసినా.. ఏ గుర్తు వ‌స్తే ఆ గుర్తు పైనే పోటీ చేయాల్సిన ప‌రిస్థితి  వ‌చ్చిందంట జ‌న‌సేన‌కి. అందుకే అంటారు.. మ‌రీ త్యాగాలు కూడా చేయ‌కూడ‌దు అని. ఇప్పుడు చూడండి.. ఆ త్యాగాల ఎఫెక్ట్ తో.. గుర్తు కూడా పోయే.. ఇక గుర్తింపు కూడా పోయే దాకా తెచ్చుకోకుండా  ఉండండి చాలు అంటున్నారు పొలిటిక‌ల్ అనలిస్టులు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle