newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

23-04-202123-04-2021 09:22:19 IST
Updated On 23-04-2021 10:07:12 ISTUpdated On 23-04-20212021-04-23T03:52:19.044Z23-04-2021 2021-04-23T03:33:12.652Z - 2021-04-23T04:37:12.841Z - 23-04-2021

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పుత్రుడు పుట్టిన‌ప్పుడు కాదు.. న‌లుగురూ మెచ్చిన‌ప్పుడే పుత్రోత్సాహం అంటారు. ఇక ప్ర‌భుత్వాలు, ప్ర‌భుత్వాధినేత‌ల విష‌యంలో కూడా అంతే క‌దా మ‌రి. జ‌నాలు ట్యాక్సులు క‌డుతుంటే మేనేజ్ చేయ‌డం.. స‌హ‌జ వ‌న‌రుల‌తో వ‌చ్చే లాభాల‌ని మేనేజ్ చేయ‌డం.. దొరికిన కాడికి దాచుకోవ‌డం కాదు. క‌ష్ట‌కాలంలో ఆదుకున్నోళ్లే ప్ర‌జ‌ల గుండెల్లో ఉండే లీడ‌ర్లు అవుతారు. 

ఇప్పుడు మ‌న తెలుగు రాష్ట్రాల సీఎం లు ఏం చేస్తున్నారు అన్న‌ది ఏం అర్దం కాదు. కేసీఆర్ సార్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న‌కే సోష‌ల్ డిస్టెన్సింగ్ లేదు. ఆయ‌నే క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకోలేదు. ఆయ‌న‌కే క‌రోనా వ‌చ్చింది అంటారు. మ‌రి ఆయ‌న అంత‌కు ముందు ఏం చేశారో జ‌నాల‌కి తెలీదా చెప్పండి. అంత‌న్నారు ఇంత‌న్నారు.. ఏసీ రూమ్ లో బ‌జ్జున్నారు అంటూ కామెంట్లు చేశారు క‌దా. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఫామ్ హౌజ్ అంటూ.. జ‌నాల్ని ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. క‌రోనా టైంలో వాళ్ల చావేదో వాళ్లే చ‌స్తారు అని వ‌దిలేశారు అని ఎన్ని మాట‌లు అన్నారో జ‌నాల‌కి గుర్తుంది క‌దా. మ‌రి సీఎం కేసీఆర్ ఇప్పుడేం చేయ‌బోతున్నారు అంటే.. ఏమో.. ఎవ‌రికి తెలుసు. జ‌నాలైతే ఎవ‌రి చావు వాళ్లు చ‌స్తున్నారు. అస‌లు ఆ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ కి.. సీఎం కేసీఆర్ కి దోస్తీనే లేదంట‌. ఈయ‌న ఫెయిల్ అయిండు అని చూపించ‌డానికి.. కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారా ఏంటి అనిపిస్తోంది. వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల కోసం జ‌నం ప్రాణాల‌తో ఆడుకుంటారా అనే వాళ్లూ ఉన్నారు. 

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఇక సీఎం జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. టెస్టులు టెస్టులు అంటారు. రికార్డుల కోసం నంబ‌ర్లు చూపించిన‌ట్లే ఉంటుంది. గుంటూరు శ్మ‌శాన వాటిక‌నీ.. శ్రీకాకుళం వ‌ల‌స కూలీల‌నీ అడిగితే క‌రోనా ఏంటో.. అది చేస్తున్న విన్యాసాలేంటో తెలుస్తుంది. కానీ.. జ‌నాన్ని కాపాడుకోవ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న సాలిడ్ నిర్ణ‌యం ఏంటో ఎవ్వ‌రికీ అర్దం కావ‌డం లేదు. ఇవ్వాళ సాయంత్రానికి మ‌రికొన్ని హాస్పిట‌ల్స్ అందుబాటులోకి వ‌స్త‌య్ అంటున్నారు ఏపీ అధికారులు. మ‌రి ప్ర‌పంచ వ్యాప్తంగా నెల‌ల‌కి ముందే లాక్ డౌన్ లు పెడుతుంటే.. మీరు ఏ కాలంలో ఉన్నారు సామే.. అస్స‌లు ప‌ట్టించుకోరా అంటున్నారు జ‌నాలు.

ఇప్పుడు హాస్పిట‌ల్స్ అందుబాటులోకి రావ‌డం ఏంటి. ఇప్ప‌టికే అన్నీ సెట్ రైట్ అయ్యి ఉండాలి క‌దా. అందుకే క‌దా.. ఆరోగ్యానికి ప్ర‌త్యేకంగా ఓ శాఖ ఉంది. దానికి వేల కోట్ల బ‌డ్జెట్ లు కేటాయించేది. ఆఫీస‌ర్లు ఏం చేస్తున్నారు లీడ‌ర్లు ఏం చేస్తున్నారు... అస‌లు సీఎం జ‌గ‌న్ ఏం చేస్తున్నారు అన్న‌ది ఎవ్వ‌రికీ అర్దం కాదు. ఏద‌న్నా చెప్పండి.. తెలుగు రాష్ట్రాల సీఎంల విష‌యానికి వ‌స్తే.. దొందూ దొందే అనే కామెంట్ ని అరుగుల మీద కూర్చుని ప‌బ్లిక్ గానే అంటున్నారు జ‌నాలు. ఏంటో సార్లూ.. మీకే తెలియాలి జ‌నం గోడు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle