newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

22-04-202122-04-2021 09:20:55 IST
Updated On 22-04-2021 11:31:58 ISTUpdated On 22-04-20212021-04-22T03:50:55.829Z22-04-2021 2021-04-22T03:50:21.467Z - 2021-04-22T06:01:58.887Z - 22-04-2021

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎక్క‌డెక్కడో కాదు. మ‌న ద‌గ్గ‌రే. మన గుంటూరులోని మ‌హా ప్ర‌స్థానం ఇది. శ్మ‌శాన వాటిక‌కి మ‌హా ప్ర‌స్థానం అని పేరు పెట్టినా.. అక్క‌డి ఆర్త‌నాదాలు ఆగ‌వు క‌దా. చూస్తుంటే ఎలా ఉందో ఎవ‌రికి వారే ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌న పొలిటీషియ‌న్లు.. మ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చేస్తుంది. ఏ మాత్రం కేర్ తీసుకుంటుంది అనే విష‌యం అర్దం అవుతోంది. సీఎం జ‌గ‌న్ సార్.. ఈ ఫోటోలు చూస్తున్నారా.. ఇక్క‌డి చావులు చూస్తున్నారా.. వారి ఆర్త‌నాదాలు వింటున్నారా.. క‌రోనా కోసం మీరేం చేస్తున్నారు అనేది మ‌ళ్లీ మ‌ళ్లీ ఆలోచించుకోండి అంటూ.. ఆ పొగ‌ల మ‌ధ్య‌లోంచి వినిపిస్తోన్న మాట‌లు.. ప్ర‌భుత్వం చెవి దాకా చేరుతున్నాయో లేదో మ‌రి.

వారం రోజులుగా గుంటూరులోని శ్మ‌శాన వాటిక శ‌వాల‌తో కిక్కిరిసి పోతుంది. అవును.. కిక్కిరిసి పోతుంది అనే మాట క‌రెక్టే. ఎందుకంటే.. రోజుకి 50 నుంచి వంద మంది చ‌నిపోయిన వారి డెడ్ బాడీస్ వ‌స్తున్న‌య్. మ‌రి రోజుకి వంద శ‌వాలు అంటే.. మామూలు విష‌య‌మా చెప్పండి. వీటిలో క‌రోనా అని నిర్దార‌ణ అయినవి కొన్ని.. కానివి కొన్ని. క‌రోనా అనుమానంతో కొన్ని.. క‌రోనా కాదులే అని చెప్పుకునే వారివి కొన్ని. ఇలా డెడ్ బాడీస్ విప‌రీతంగా వ‌స్తున్న‌య్. వ‌రుస‌న క‌ట్టెలు పేర్చి.. కాల‌బెట్టేస్తున్నారు. ఏం చేస్తారు చెప్పండి. అక్క‌డ ప‌ని చేసే సిబ్బంది కూడా.. ఏంటిరా ఈ చావులు అని టెన్ష‌న్ తో వ‌ణుకుతున్నార‌ట‌.

ఎటు పోయి ఎటు వ‌స్తుందో.. క‌రోనా త‌మ‌కి వ‌స్తుందేమో అని భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఈ శ్మ‌శానానికి రోజుకి మూడు నుంచి నాలుగు శ‌వాలు వ‌స్తాయంట‌. కానీ.. బుధవారం 40, మొన్న మంగ‌ళ వారం నాడు 52.. అంత‌కు ముందు రెండు మూడు రోజులు కూడా 20 పాతిక వ‌చ్చాయ‌ట. మూడు నాలుగు నుంచి.. ఒకేసారి.. ఇర‌వై పాతిక‌కి చేరి.. అక్క‌డి నుంచి ఒకేసారి.. న‌ల‌భై యాభైకి చేరాయి. ముందు ముందు రోజుల్లో ఈ సంఖ్య ఇంకెంత‌లా ఉంటుందో.. ఇక జిల్లా వ్యాప్తంగా సంఖ్య ఇంకెంత ఉందో.. ఒక్క జిల్లా ప‌రిస్థితే ఇలా ఉంటే.. రాష్ట్రం మొత్తం ప‌రిస్థితి ఎలా ఉందో.. ఎందుకు ఇవ‌న్నీ బ‌య‌టికి రావ‌డం లేదో..ఆ దేవుడికైనా తెలుసో లేదో. 


Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle