newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

19-04-202119-04-2021 09:36:53 IST
Updated On 19-04-2021 09:50:08 ISTUpdated On 19-04-20212021-04-19T04:06:53.684Z19-04-2021 2021-04-19T04:06:14.702Z - 2021-04-19T04:20:08.647Z - 19-04-2021

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిజ‌మే క‌దా. ఫైర్ బ్రాండ్ అని ఊరికే అన్నారా చెప్పండి. ఎమ్మెల్యే రోజా అంటే ఏంటో తెలిసిందే క‌దా. ఏ ప‌క్షంలో ఉన్నా.. అవ‌త‌లి ప‌క్షంపై విరుచుకు ప‌డ‌తారు. పాయింట్ టు పాయింట్ రెయిజ్ చేస్తారు. పంచుల మీద పంచులేస్తారు. అస‌లే కామెడీ ప్రోగ్రామ్స్ లో పంచులు బాగా ఎక్స్ పీరియ‌న్స్ క‌దా. ఆ మాట‌ల ఎఫెక్ట్ కూడా ఎంత‌న్నా.. ఎంతో కొంత ఉండ‌నైతే ఉంటుంది క‌దా. అవి అలా ఉంచితే.. మాట‌ల తూటాలు అంటారు కదా.. ఆ విష‌యంలో మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌రు.

ఇప్పుడు కూడా అంతే. అస‌లే వైసీపీ లీడ‌ర్ రోజాకి ఈ మ‌ధ్య హెల్త్ బాలేదు. అయినా స‌రే.. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. అస‌లే హెల్త్ బాలేద‌ని అంద‌రూ గెట్ వెల్ సూన్ అంటూ విషెస్ చెబుతున్నారు. నంద‌మూరి బాల‌క్రిష్ణ కూడా మ‌న రోజానే క‌దా.. అయ్యో పాపం ఎంత ప‌నైంది. ఇప్పుడెలా ఉంది ఆరోగ్యం అంటూ ఫోన్ చేసి మ‌రీ ఫ్యామిలీతో మాట్లాడారు. కానీ.. రోజా మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. త‌గ్గేదే లేదు అంటున్నారు. రెస్ట్ తీసుకుంటూ కూడా పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్న రోజా.. పంచులేస్తున్నారు.

అయితే.. ఎంత సీరియ‌స్ టాపిక్ అయినా.. స‌డ‌న్ గా వ‌చ్చిన ఇష్యూ మీద రియాక్ట్ అయ్యుంటే.. ఎంత‌న్నా ఎమ్మెల్యే అన్నాక‌.. ఎలా ఆగుతారు రెస్పాండ్ కాకుండా ఎలా ఉంటారు. పాణం ఊరుకుంటుందా అనుకుంటారు. కానీ.. మినిస్ట‌ర్  పెద్దిరెడ్డిపై చేస్తున్న కామెంట్స్ పై రెస్పాండ్ అయ్యారు రోజా. తిరుప‌తిలో దొంగ ఓట్ల ఎవ్వారం ప‌బ్లిక్ లో బానే న‌లుగుతోంది. ప్రూఫ్స్ కూడా ఉండ‌డంతో.. విష‌యం అర్దం అవుతోంది.

అలాంట‌ప్పుడు మినిస్ట‌ర్ల‌పైనా అధికార పార్టీ పైనా కామెంట్స్ కామ‌న్. పైగా ఇదేమ‌న్నా కొత్తా.. ఎల‌క్ష‌న్ ఏమైనా ఇప్పుడే జ‌రుగుతున్నాయా.  రెండు మూడు నెల‌లుగా ఏపీలో అంతా ఎల‌క్ష‌న్ వెద‌రేనాయే. కామెంట్ల కొట్లాటేనాయే. ఈ టాపిక్ పై మాట్లాడ్డంతో.. అస‌లే ఆరోగ్యం బాలేదాయే. ఈ టైంలో ఈ రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా మేడ‌మ్. కాస్త నిమ్మ‌లంగా ఉండొచ్చు క‌దా అంటున్నారు.. ఆమె శ్రేయోభిలాషులు.

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   3 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle