newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి

11-04-202111-04-2021 12:33:00 IST
2021-04-11T07:03:00.282Z11-04-2021 2021-04-11T07:02:57.704Z - - 15-05-2021

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

హిందూపురం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కే తిప్పేస్వామి ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిగిలోని తన నివాసంలోనే తెల్లవారుజామున 3.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. హిందూపురం నుంచి కాంగ్రెస్ తరఫున 1978 ఎన్నికల్లో తిప్పేస్వామి విజయం సాధించారు. 1983 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి 1983 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ తప్ప మరే పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. కేవలం రాజకీయ నేతగానే కాకుండా.. సామాజిక సేవతోనూ తిప్పేస్వామి గుర్తింపు పొందారు. సేవ మందిరాన్ని ఏర్పాటుచేసి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. తిప్పేస్వామి మృతిపై కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు నేతల ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తిప్పేస్వామి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి.

గత 15 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 1941లో జ‌న్మించిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయ ప్ర‌వేశం చేసి.. 1978లో తొలిసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1947లో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సొంత స్థలంలో ఏఎం లింగన్న పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలని అనుకున్నారు. సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సొంత స్థలంలో తన తండ్రి ఎంఏ. లింగన్న పేరుతో విద్యాసంస్థలను ప్రారంభించిన ఆయన.. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ సేవలు అందించారు. తిప్పేస్వామి మృతి విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి తిప్పేస్వామి భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. తిప్పేస్వామి మృతితో జిల్లా రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. పలువురు సీనియర్ నాయకులు, వివిధ పార్టీల నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అభిమానులు కూడా ఆయన్ను కడసారి చూసుకోవాలని తరలి వచ్చారు. 

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   3 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   26 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   37 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle