జగన్ సర్కార్ కి మరో దెబ్బ.. ఎన్నికలు జరపాలని చెప్పిన హై కోర్టు
21-01-202121-01-2021 11:04:48 IST
Updated On 21-01-2021 11:10:15 ISTUpdated On 21-01-20212021-01-21T05:34:48.259Z21-01-2021 2021-01-21T05:34:44.798Z - 2021-01-21T05:40:15.915Z - 21-01-2021

అడ్డడ్డే.. ఎన్ని టర్నులు తిరుగుతోంది ఏపీ లోకల్ బాడీస్ ఎన్నికల వ్వవహారం. మొన్ననే హైకోర్టు చెప్పింది. ఏమనీ చెప్పిందీ అంటే.. ఎన్నికలు వద్దులే అని చెప్పింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. హైకోర్టు కి వెళ్లిన సర్కార్.. తమకు అనుకూలంగా తీర్పు వచ్చేలా ప్రయత్నాలు చేసుకుంది. సర్కార్ వాదనలు విన్న.. ఏపీ హైకోర్టు.. ఇప్పుడు ఎన్నికలు ఎలా జరుపుతారు. జనం ప్రాణాలు ఇంపార్టెంట్ కదా అని చెప్పింది. సో.. అంతటితో ఆగిపోయింది. ఎస్ఈసీ రమేశ్ కుమార్ కి ఎదురు దెబ్బ తగిలింది. సడన్ గా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందుకు సర్కార్.. వేసిన ప్లాన్ వర్కవుట్ అయింది అనుకున్నారు. కానీ.. ఎస్ఈసీ రమేశ్ కుమార్ అంతటితో ఆగలేదు. మళ్లీ అదే హైకోర్టులో.. మళ్లీ పిటిషన్ వేశారు. రిట్ అప్పీల్ పిటిషన్ వేసిన హైకోర్టు.. రెండు రోజుల క్రితమే రెండు సైడ్స్ నుంచి వాదనలు విని తీర్పు రిజర్వ్ లో పెట్టింది. ఇప్పుడు మాత్రం జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఎన్నికలు జరపడానికి ఏం ప్రాబ్లమ్ లేదు. జరుపుకోండి. కాకపోతే కాస్త జాగ్రత్తలు తీసుకుని స్థానిక ఎన్నికలు జరుపుకోండి అని చెప్పింది కోర్టు. ప్రభుత్వం తరపున లాయరేమో.. కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఈ టైంలో సిబ్బంది బిజీ అవుతారు. అలాంటప్పుడు ఎన్నికలు ఎలా జరుపుతాం అని వాదించారు. ఇటు ఎస్ఈసీ సైడ్ నుంచేమో.. అంతా సజావుగానే జరుగుతుంది. అన్ని చోట్లా ఎన్నికలు జరుపుతున్నారు. మన దగ్గర వచ్చిన ప్రాబ్లమ్ ఏం ఉంది. సిబ్బంది ఫుల్ గా ఉన్నారు. ఎలాంటి సమస్యా రాదు.. అంతా మేం చూసుకుంటాం.. ఎన్నికలు జరపడానికి పర్మిషన్ ఇవ్వండి అని ఎస్ఈసీ తరపున లాయర్ కోరారు. ఫైనల్ గా రెండు పక్కల నుంచి వాదనలు విన్న హైకోర్టు.. ఓకే ఓకేలే.. ఎన్నికలు జరుపుకోండిలే. కాకుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్లాన్ చేయండి అని చెప్పింది. సో.. హైకోర్టు నుంచి ఎన్నికలకు పర్మిషన్ వచ్చేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ ఏం చేయబోతుంది. వాట్ నెక్స్ట్ అనేది హాట్ టాపిక్ అయి కూర్చుంది.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
3 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
3 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
5 hours ago

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?
35 minutes ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
20 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
a day ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
12 hours ago
ఇంకా