newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరోసారి ఆలోచించండి.. ఇంటర్ పరీక్షలపై సర్కారుకు హైకోర్టు సూచన

30-04-202130-04-2021 14:29:08 IST
Updated On 01-05-2021 07:44:22 ISTUpdated On 01-05-20212021-04-30T08:59:08.462Z30-04-2021 2021-04-30T08:59:06.290Z - 2021-05-01T02:14:22.214Z - 01-05-2021

మరోసారి ఆలోచించండి.. ఇంటర్ పరీక్షలపై సర్కారుకు హైకోర్టు సూచన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఇటు న్యాయపరంగానూ, అటు ఆరోగ్య పరంగానూ కలకలం రేపుతోంది. ఈ పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలకు పోవడంతో వ్యవహారం హై కోర్టుకు వచ్చింది. ఈ పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనను పునః పరిశీలించుకోవాలని ప్రభుత్వానికి కోర్టు స్పష్టం చేసింది. కోవిడ్  వైరస్ కేసులు రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ యోచనపట్ల ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని తెలిపింది.

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎప్పటికప్పుడు పెరుగుతున్నందున వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు వద్దని ప్రభుత్వానికి చెబుతున్నప్పటికీ అందుకు భిన్నంగానే సర్కారు వ్యవహరిస్తోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా కోవిడ్ కేసులు తీవ్రంగా ఉన్నాయని అలాంటి పరిష్టితుల్లో పరీక్షలు నిర్వహించలేక వాయిదా వేశాయని హై కోర్టు గుర్తుచేసింది. రాష్ట్రంలో కూడా కోవిడ్ కేసులు ఆందోళనకరంగా ఉన్నప్పుడు పరీక్షలు ఎలా నిర్వహించదలచుకున్నారని కోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ క్లైయిమ్ దాఖలు చేయాలనీ కోరుతూ కేసు తదుపరి విచారణను మే మూడవ తేదీకి వాయిదా వేసింది.

ఇంటర్ పరీక్షలు అన్నవి విద్యార్థులకు చాలా ముఖ్యం కాబట్టి అనుకున్న ప్రకారమే వీటిని నిర్వహించి తీరుతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ స్పష్టం చేయడమే కాకుండా హాల్ టికెట్ల ను కూడా విడుదల చేశామని వెల్లడించడంతో పరిస్థితి ముదురుపాకాన పడింది.  ఇప్పుడు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడుతుందా లేక అనుకున్న ప్రకారమే వీటిని నిర్వహిస్తుందా  అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పరిస్థితి ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం తన వంతు చర్యలను చక చకా చేసుకుంటూ పోతోంది.

ఇప్పటికే ఇంటర్ పరీక్షల కోసం 1450 కేంద్రాలను ఏర్పాటు చేసింది. సగటున ఒక్కో జిల్లాలో 80కి పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. కోవిద్ వైరస్ ప్రాణాంతకమవుతున్న సమయంలో పరిస్థితి తీవ్రతను లెక్క చేయకుండా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. అనుకున్నట్లుగా మే 5వ తేదీన పరీక్షలు జరిగితే మాత్రం పరీక్ష కేంద్రాలకు ఇటు పిల్లలూ, వారి తల్లిదండ్రులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని టిడిపి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను దృష్టిలోపెట్టుకుని వ్యవహరించాలని కోవిడ్ కేసుల మధ్య పరీక్షలు నిర్వహించడం వల్ల  తలెత్తే విపరిణామానాలను విస్మరించకూడదని పలువర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle