newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

మ‌స్కా మూవీని మ‌రిపించే గుంటూరు పాలిటిక్స్

18-10-202018-10-2020 19:32:47 IST
Updated On 19-10-2020 10:28:20 ISTUpdated On 19-10-20202020-10-18T14:02:47.058Z18-10-2020 2020-10-18T14:02:37.266Z - 2020-10-19T04:58:20.555Z - 19-10-2020

మ‌స్కా మూవీని మ‌రిపించే గుంటూరు పాలిటిక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

స‌మ‌యం లేదు మిత్ర‌మా. ర‌ణ‌మా శ‌ర‌ణ‌మా. ఇవే డైలాగులు.. గుంటూరు పాలిటిక్స్ లో ఫుల్ గా వినిపిస్తున్న‌య్. గుంటూరు మిర్చిలాగే ఘాటు ఘాటుగా ఉన్న‌య్. ఓ ప‌క్క విడ‌ద‌ల ర‌జ‌నీ. మ‌రో ప‌క్క సీనియ‌ర్ లీడ‌ర్. సింగిల్ టైంలోనే మినిస్ట‌ర్ కావాలంటే ఆమేమైనా దిగొచ్చారా.. ఇన్నాళ్లూ పార్టీల్లో ఉండి.. రాజకీయాల్లో త‌ల పండిన మేం ఏం కావాలి అని సీనియ‌ర్ల వ‌ర్ష‌న్. ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాద‌న్న‌య్యా.. మంత్రి ప‌ద‌వి వ‌చ్చిందా లేదా అన్న‌దే లెక్క అనేది.. విడ‌ద‌ల ర‌జ‌నీ సైడ్ వ‌ర్ష‌న్. ఇలా ఫైటింగులు కూడా చేస్తున్నార‌ట‌. ఆ మ‌ధ్య ఎక్క‌డో కార్య‌క‌ర్త‌లు కొట్టుకున్నార‌ట కూడా. అప్ప‌టి నుంచి ఇంకాస్త హీటెక్కింది గుంటూరు రాజ‌కీయం. మ‌రి ఇంత గొడ‌వ ఎందుకో తెలుసు క‌దా. మంత్రి ప‌ద‌వి. 

మంత్రి ప‌ద‌వి వ‌స్తుందంటే లీడ‌ర్లు ఆగుతారా చెప్పండి. ఉన్న ప‌ద‌వుల్ని తొల‌గించి ప‌ద‌వి గుంజుకోవాల‌ని చాలా మంది లీడ‌ర్లు ట్రై చేస్తుంటారు. ఇక ప‌దవులు పంచే టైం ద‌గ్గ‌రికొస్తుంటే ఊరుకుంటారా. ఆల్రడీ రెండున్న‌రేళ్ల త‌ర్వాత ప‌ద‌వులు పోత‌య్.. క్యాబినెట్ లోకి కొత్త మంత్రులు వ‌స్తారు అని అప్పుడే చెప్పారు సీఎం జ‌గ‌న్. సీఎం గా బాధ్య‌త‌లు తీసుకుని ఏడాదిన్న‌ర అవుతోంది. ఇక ఏడాది మాత్ర‌మే ఉంది. జ‌గ‌న్ మాట అన్న త‌ర్వాత త‌గ్గుతారు అనే మాటే లేదు.

క‌చ్చితంగా రెండున్న‌రేళ్లు నిండ‌గానే కొత్త లీడ‌ర్ల‌కి మంత్రి ప‌ద‌వులు ఇస్తారు. ఆ కోటాలో ఎలాగైనా మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకోవాల‌ని విడ‌ద‌ల ర‌జ‌నీ ట్రై చేస్తున్న విష‌యం తెలిసిందే క‌దా. ఇక అవ‌త‌ల వ‌ర్గం కూడా గ‌ట్టిగానే ఉందంట‌. అందుకే.. నిఘాలు పెట్టించి.. త‌ప్పులు చూపించి.. ర‌జ‌నీకి ప‌ద‌వి రాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.

ఒకే జిల్లాలో ఎక్కువ మందికి ప‌ద‌వులు ఇవ్వ‌డం కూడా కుద‌ర్దు క‌దా. అందు‌కే అచ్చంగా మస్కా మూవీని త‌ల‌పిస్తోంది అక్క‌డి రాజ‌కీయం. ఒకే చోట‌..ఒకే మంత్రి ప‌ద‌వికి ఇద్ద‌రు లీడ‌ర్లు పోటీ ప‌డితే.. ఒక‌రిపై ఒక‌రు రాజ‌కీయాలు చేసుకుని.. వాళ్ల‌కి రాకుండా చేసి.. వీళ్లు లాక్కోవాల‌ని చూడ్డం మామూలేగా. ఇప్పుడు గుంటూరులో అచ్చంగా అదే జ‌రుగుతోంది. ఇక ఇద్ద‌రు కొట్టుకుంటుంటే మూడో వాళ్ల‌కి బెన్ ఫిట్ జ‌రుగుతుంది అన్న‌ట్లు. వేరే వాళ్లు కూడా బానే ట్రై చేస్తున్నార‌ట‌. చూడాలి. బీసీ కోటా.. లేడీ కోటాలో విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందా. వేరే వాళ్లు ఎగ‌రేసుకు పోతారా అన్న‌ది ఇప్పుడే డిసైడ్ చేయ‌లేం. ఈ హీట్ మంత్రి ప‌ద‌వులు డిక్లేర్ చేసే దాకా త‌గ్గ‌నే త‌గ్గదు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle