newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

జమ్మలమడుగు వైసీపీ.. 3 గ్రూపులు.. 6 పంచాయతీలు..

12-01-202112-01-2021 14:01:50 IST
2021-01-12T08:31:50.858Z12-01-2021 2021-01-12T08:31:42.128Z - - 20-01-2021

జమ్మలమడుగు వైసీపీ.. 3 గ్రూపులు.. 6 పంచాయతీలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రాంతం ఏదైనా కానీ వైసీపీలో మాత్రం అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకోబోతున్నాయి. ఎప్పుడు ఏ విస్ఫోటనం చోటు చేసుకుందో అసలు ఊహించడం వైసీపీ నేతలకు కూడా కష్టమే. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వైసీపీల్లో వర్గాలు ఏర్పడ్డాయి. ఆ వర్గాల్లో విబేధాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఇదే తరహా రాజకీయాలు వైసీపీలో ఉంది. జమ్మలమడుగు వైసీపీ విభాగం కూడా మేము కూడా ఇతర ప్రాంతాలకు ఏ మాత్రం తగ్గమనే సంకేతాలను ఇస్తూ ఉంది. కడప జిల్లా జమ్మలమడుగులో ఇప్పుడు  ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య రాజకీయాలు నడుస్తున్నాయనే ప్రచారం సాగుతూ ఉండగా.. వీరిద్దరి మధ్య మరో గ్రూప్‌ కూడా వచ్చేసింది. దీంతో ఆ ప్రాంతంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. ముఖ్యంగా సెటిల్మెంట్ల విషయంలో చాలానే చోటు చేసుకుంటూ ఉన్నాయి. 

జమ్మలమడుగు వైసీపీ‌ ఆధిపత్యపోరు కొత్త మలుపు తిరిగిందని అంటున్నారు. ఎమ్మెల్యే వైరి వర్గం కొత్త నేతతో జత కలిసిందని అంటున్నారు. ఎన్నికల్లో సీనియర్లకు సుధీర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. అయితే స్థానిక వైసీపీ నేతలంతా ఆయన గెలుపు కోసం కలిసి పనిచేశారు. ఇక గెలిపించేదే తమ పనుల కోసం కదా.. కష్టపడిన పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై  ఆగ్రహంగా ఉంది పార్టీలోని ఓ వర్గమనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి వారంతా కలిసి పార్టీలో కొత్త గ్రూప్‌ పెట్టుకున్నారు. ఇక ఎమ్మెల్యే సమీప బంధువొకరు వ్యతిరేకవర్గాన్ని చేరదీయడంతో.. అది తెలిసిన సుధీర్‌రెడ్డి పోలీసుల సాయంతో వారిని నిర్బంధించారట.. ఈ అంశం కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది.

మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో ఎమ్మెల్యేకు మొదటి నుంచి పడకపోవడం కూడా అక్కడ టెన్షన్ వాతావరణానికి కారణం అవుతోంది.  ఇటీవల ఓ వివాహ వేడుకలో రామసుబ్బారెడ్డి వద్దకు ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం చేరిందని అంటున్నారు. ఈ కలయిక సమయంలో రామసుబ్బారెడ్డితో చాలా విషయాలనే చర్చించారని కూడా అంటున్నారు. ఇక ఈ విషయం పార్టీ పెద్దల వరకూ వెళ్లడంతో ఈ గ్రూపు తగాదాలను తగ్గించాలని అంటూ ఉన్నారు. ఈ అంశంపై అధిష్ఠానం ఎలా నిర్ణయం తీసుకుంటుందా అని కూడా చర్చిస్తూ ఉన్నారు. రామసుబ్బారెడ్డి ఈ సమస్యను తీరుస్తారా లేక ఇంకో నేత దగ్గరకు ఈ పంచాయితీ వెళ్తుందా అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. 

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   4 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   4 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   6 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   8 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   9 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   9 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   11 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   13 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   14 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   15 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle