newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ఉచిత విద్యుత్‌కు ఏపీలో నిధుల విడుదల

16-10-202016-10-2020 08:14:05 IST
2020-10-16T02:44:05.703Z16-10-2020 2020-10-16T02:44:02.585Z - - 21-10-2020

ఉచిత విద్యుత్‌కు ఏపీలో నిధుల విడుదల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేయించి చెల్లిస్తామని కొన్ని వారాల క్రితం పేర్కొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనతి కాలంలోనే తానిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రతిపక్షాల విమర్శలన్నింటినీ పక్కనపెట్టిన సీఎం ఇంతత్వరగా వైలట్ ప్రాజెక్టును నిధులివ్వడం గమనార్హం.

వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం కింద నగదు బదిలీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు సంబంధించి సెప్టెంబర్‌ నెలకయ్యే రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలు తీసుకురాగా.. ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీని నేరుగా రైతు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుపై ఏమాత్రం భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. రైతు ఖాతాల్లో ప్రభుత్వ సొమ్ము చేరిన తర్వాతే దాన్ని విద్యుత్‌ సంస్థకు పంపుతామని స్పష్టం చేసింది. 

పక్కా లెక్క ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు గత ప్రభుత్వం ఏటా రూ.4 వేల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చేది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2020–21లో వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీకి రూ.8,353.70 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్‌ లోడ్, కనెక్షన్లను బట్టి నగదు బదిలీకి అయ్యే వ్యయాన్ని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ లెక్కగట్టింది. 

ఆ జిల్లాలో మొత్తం 25,971 వ్యవసాయ పంపుసెట్లు ఉండగా.. వీటి వినియోగ సామర్థ్యం 1,02,963 హార్స్‌పవర్‌ (హెచ్‌పీ). ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన ప్రకారం ఒక్కో యూనిట్‌ ధర రూ.6.58. ఈ లెక్కన సెప్టెంబర్‌ నెలలో విద్యుత్‌ సబ్సిడీ రూ.6.05 కోట్లు ఉంటుందని ఈపీడీసీఎల్‌ లెక్కగట్టింది. ఈ మొత్తం రైతు ఖాతాల్లోకే వెళుతుంది. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle