newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

పోలీసులకు కులం, మతం అంటూ ఏమీ ఉండవు.. అసత్య ప్రచారం చేస్తున్నారు: గౌతమ్ సవాంగ్

13-01-202113-01-2021 21:47:52 IST
2021-01-13T16:17:52.436Z13-01-2021 2021-01-13T16:17:33.245Z - - 17-01-2021

పోలీసులకు కులం, మతం అంటూ ఏమీ ఉండవు.. అసత్య ప్రచారం చేస్తున్నారు: గౌతమ్ సవాంగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడమే ఆలయాలపై దాడులకు కారణమనే ప్రచారం కూడా సాగుతోంది. పోలీసులను కూడా కొందరు ప్రతిపక్ష నాయకులు తప్పుబట్టారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఎన్నో పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ పోస్టులపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయంటూ సామాజిక మాధ్య‌మాల్లో అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయన అన్నారు. అంతేకాకుండా వాస్తవాల‌ను వ‌క్రీక‌రిస్తూ పోస్టులు పెడుతున్నారని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. రాజకీయ కారణాలతో కొంద‌రు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నార‌ని విమర్శించారు. దేవాలయాలపై దాడులు జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని కొంద‌రు ప్రశ్నిస్తూ ఉన్నారని..  పోలీసుల కులం, మతం ఫలానా అంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పోలీసులు కుల‌మ‌తాల ఆధారంగా ప‌నిచేయ‌బోర‌ని స్పష్టం చేశారు.  

దేశ సమగ్రతను కాపాడటంలో పోలీసులు పనిచేస్తున్నారని.. అంతర్వేది ఘటన జర‌గ‌డం దురదృష్టకరమ‌ని అన్నారు. అనంత‌రం రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయని అన్నారు. ఇప్ప‌టికే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని ఆయ‌న గుర్తు చేశారు. ఏపీలో దేవాల‌యాల‌కు సంబంధించి మొత్తం 44 కేసులు ముఖ్యమైనవని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని 58, 871 హిందూ ఆలయాలకు జియో ట్యాగింగ్ చేశామ‌ని ఆయ‌న అన్నారు. ఏపీలోని 13,000 ఆలయాల్లో ఇప్ప‌టికే 43,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో 29 కేసులను ఛేదించడంతో పాటు  80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను అరెస్టు చేశామని చెప్పారు.  తాము 3 నెలల కిందటే రామతీర్థం ఆలయంలో భద్రతను పెంచామ‌ని, అదనంగా 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామ‌ని చెప్పారు. కొండపైన ఉన్న దేవాలయంలో విద్యుత్ సరఫరా లేకపోవ‌డంతోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఏపీ లోని ఆలయాలు ఆపదలో ఉన్నాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని.. సత్యదూరమని ఖండించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసు శాఖ ఆలయాల భద్రతను పాటిస్తోందని డీజీపీ స్పష్టం చేశారు. మత సామరస్యానికి ఆంధ్రప్రదేశ్ ఓ ప్రతీక అని.. దానిని కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులపై సిట్ ఏర్పాటు చేశామన్నారు. అనవసరమైన విషయాలలో ఉద్దేశపూర్వకంగా దేవాలయ సంబంధిత అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారని డీజీపీ స్పష్టం చేశారు. 

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

   6 hours ago


కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   7 hours ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   8 hours ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   13 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   14 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   15 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   16 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   17 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   18 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   18 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle