newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

చంద్రబాబు రాజకీయ అజెండాతోనే లేఖలు రాస్తూ ఉన్నారు

14-10-202014-10-2020 17:27:35 IST
Updated On 15-10-2020 09:29:34 ISTUpdated On 15-10-20202020-10-14T11:57:35.701Z14-10-2020 2020-10-14T11:57:28.083Z - 2020-10-15T03:59:34.328Z - 15-10-2020

చంద్రబాబు రాజకీయ అజెండాతోనే లేఖలు రాస్తూ ఉన్నారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖాస్త్రాలను సంధిస్తున్న సంగతి తెలిసిందే..! ఈ లేఖలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబు నాయుడుకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు లేఖల ద్వారా చేస్తున్నవంతా అవాస్తవాలని, రాజకీయ అజెండాతోనే ఈ వ్యాఖ్యలను చేస్తున్నారని గౌతమ్ సవాంగ్ చెప్పారు. అవాస్తవాలతో లేఖలు రాస్తున్నారని, విచారణ జరిపితే ఆరోపణలు నిజం కాదని తేలుతోందని అన్నారు. రాజకీయ అజెండాతో లేఖలు రాస్తున్నారని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు ఏపీ డీజీపీ. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేలా చర్యలను చేపట్టామని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని అన్నారు. 

మంగళవారం నాడు కూడా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు నేరచరిత్రగల వాళ్లు అధికారంలోకి వస్తే వాటిల్లే ఉపద్రవాలకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఒక తప్పు చేయడం, ఆ తప్పును కప్పిపుచ్చకోడానికి ఇంకా పెద్దతప్పు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇచ్చిన అధికారం ప్రజలను చంపడానికి లైసెన్స్ అనుకుంటున్నారా..? అని బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన అవినీతి బురద ఇతరులకు అంటించడం, తప్పుడు వార్తలతో ప్రజల్లో అపోహలు పెంచడం జగన్ నైజమని చంద్రబాబు ఆరోపించారు. ప్రశ్నించిన వాళ్లపై దాడులు చేయడం, బెదిరించి భయపెట్టి లోబర్చుకోవడం ఆయన రాజకీయమన్నారు.

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

   19 minutes ago


ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

   an hour ago


ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   12 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   13 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   16 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   16 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   17 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   17 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   17 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   17 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle