newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

అవినీతిపరులు కోర్టులపై బురద చల్లడమా.. చంద్రబాబు ఆగ్రహం

17-10-202017-10-2020 13:27:09 IST
2020-10-17T07:57:09.530Z17-10-2020 2020-10-17T07:57:05.462Z - - 29-10-2020

అవినీతిపరులు కోర్టులపై బురద చల్లడమా.. చంద్రబాబు ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రేపో, మాపో కనీసం పదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిన వ్యక్తులు ఉన్నత న్యాయస్థానాలపై ఆరోపణల పేరుతో బురద జల్లడం హేయమైన విషయమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అనేక కేసుల్లో ఇరుక్కొని కోర్టు బోనులు ఎక్కుతున్న అవినీతిపరులు న్యాయస్థానాలపై బురదచల్లడానికి పూనుకోవడం ఏ రకంగానూ సమంజసం కాదని ఆయన అన్నారు.

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ నేతలతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘ఢిల్లీ సంస్థ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం జగన్‌కు 10 నుంచి 30 సంవత్సరాల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. అంతటి అవినీతిపరుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని న్యాయ వ్యవస్థపై బురద చల్లాలని చూస్తున్నాడు. నిష్పాక్షికంగా న్యాయాన్ని అమలు చేస్తున్న న్యాయమూర్తులపై తమ వారితో దాడులు చేయిస్తున్నాడు. వైసీపీ నాయకులు న్యాయ వ్యవస్థపై చేస్తున్న కామెంట్లకు దేశం మొత్తం ఛీ కొడుతున్నా వారికి సిగ్గు రావడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘దిశ’ పేరుతో చట్టమే లేకపోయినా ఆ పేరుతో పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి, సమీక్షలు చేసి ఏడాదిన్నరగా డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. సైకోల పాలనలో రాష్ట్రంలో సైకోలు స్వైర విహారం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలు లోపిస్తే ఏం జరుగుతుందో విజయవాడలో ఒక యువతిని కిరాతకంగా హతమార్చడమే నిదర్శనమని మండిపడ్డారు. భారీ వర్షాలు, వరదల్లో పంట నష్టపోయిన రైతులను పలకరించే నాధుడే లేకుండా పోయారని చంద్రబాబు ఆరోపించారు. 

ఇసుక అక్రమ రవాణాలో మునిగి తేలుతున్న అమరావతి ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు ఆ డబ్బుకు కక్కుర్తిపడి రాజధానికి ద్రోహం చేస్తున్నారని, కట్టు బానిసల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ అవినీతి కేసులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు విచారించే అవకాశం ఉందని, అందుకే వైసీపీ నాయకులు న్యాయ వ్యవస్థపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. 

కాగా సీఎం జగన్‌ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారని శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని సీనియర్‌ న్యాయవాదులే చెప్పారన్నారు. ‘జగన్‌ జైలుకు వెళ్తాడనే చర్చ అతని పార్టీలోనే జరుగుతోంది. తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే ఆలోచనలు వైసీపీలో జోరుగా చేస్తున్నారు. జగన్‌రెడ్డి ఆందోళన, వైసీపీ కార్యకర్తల్లో చర్చలు లేఖలో ప్రతిఫలించాయి’ అని యనమల రామకృష్ణుడు శుక్రవారం ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. 

జగన్‌ ఇప్పటికే తనపై ఉన్న 11సీబీఐ, 7 ఈడీ, 13 ఇతర కేసులకు అదనంగా కోర్టు ధిక్కరణ కేసు తెచ్చుకోబోతున్నారు. పదేళ్లు శిక్షపడితే 16ఏళ్ల అనర్హత భయం జగన్‌ను వెంటాడుతోంది. అందుకే తప్పులమీద తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle