newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

15-04-202115-04-2021 18:11:36 IST
2021-04-15T12:41:36.218Z15-04-2021 2021-04-15T12:40:37.126Z - - 15-05-2021

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అవును నిజ‌మే. ఎన్నిక‌ల వేళ ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే క‌దా. ఆ హ‌డావిడీ.. ఆ క‌తా అంతా వేరే. ఓటరే దేవుడు కోట‌రే ఆప‌ద్బాంధ‌వుడు. మ‌రి ఎన్నిక‌లు ఉంటే మంచిదే క‌దా. మంచిగ బీర్లు దొరుకుత‌య్ బిర్యానీలు దొరుకుత‌య్.. పైస‌ల్ దొరుకుత‌య్. మంచి ఎంట‌ర్ టైన్ మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే.. మాట్లాడుకోవ‌డానికి.. న‌లుగురికీ ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ ఉంటుంది క‌దా. 

ఇక పోతే.. ఓట‌రే దేవుడు అన్నాం క‌దా. ఆ విష‌యంలో కూడా ఓ మంచి బెన్ ఫిట్ ఉంది. ఎందుకంటే.. ఎన్నిక‌ల‌ప్పుడు వ‌చ్చిన ప్ర‌జా ప్ర‌తినిధులు త‌ర్వాత మొహం కూడా చూపించ‌రు. ఎన్నిక‌ల టైంలో.. ఓట‌రు చుట్టూ తిరిగిన లీడ‌ర్లు.. త‌ర్వాత చ‌ల్ తా అంటూ.. ఇటు పిలుస్తుంటే అటు తిరిగి వెళ్తుంటారు. ఇది ఓట‌రుకి మామూలుగా ఎదుర‌య్యే ప‌రిస్థితే క‌దా. ఇప్పుడు మాత్రం అంత సీన్ ఉండ‌దు. ఎందుకంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఎలా జ‌రుగుతున్న‌యో చూస్తూనే ఉన్నాం క‌దా. ఎప్పుడూ ఏదో ఒక చోట ఎన్నిక‌లు జ‌రుగుతూనే ఉన్న‌య్. అంటే.. ఓట‌రే ముఖ్యం. ఓటే అవ‌స‌రం. సో.. లీడ‌ర్ ఎప్పుడూ ఒట‌ర్ కి ట‌చ్ లో ఉండాల్సిందే. ఒక ఎన్నిక‌లు జ‌రిగి.. మ‌రో ఎన్నిక‌లు జ‌రిగే మ‌ధ్య‌లో జ‌నాలు ఏదైనా ప‌ని చేసి పెట్ట‌మంటే.. చ‌చ్చిన‌ట్లు చేసిపెట్టాల్సిందే. ఎందుకంటే.. వెంట‌నే మ‌రో ఎన్నిక‌లు ఉంటాయి అనే క్లారిటీ ఉంటుంది క‌దా. వామ్మో ఇప్పుడు ఈ ప‌ని చేయ‌క‌పోతే.. త‌ర్వాత మ‌నం ఇంటికెళ్తే వీళ్లు డోర్లేసుకుంటారు. లేదంటే అటు పార్టీకి జై కొడ‌తారు అనే భ‌యం ఉంటుంది క‌దా.

ఇప్పుడు ఏడాది కాలంగా చూస్తుంటే.. ఏపీ తెలంగాణ‌ల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఏపీలో పంచాయితీ, కార్పొరేష‌న్, ఉప ఎన్నిక‌లు ఇలా ఏదో ఒక హ‌డావిడి న‌డుస్తూనే ఉంది. ఇక తెలంగాణ‌లో కూడా అంతే బై పోల్, గ్రేట‌ర్, బై పోల్.. మ‌ళ్లీ మున్సిప‌ల్.. ఇలా ఏదో ఒక హ‌డావిడి న‌డుస్తూనే ఉంది. మొత్తానికైతే.. క‌రోనా కాలం అలా ఉండ‌గానే.. ఓట్ల కాలం కూడా న‌డుస్తూనే ఉంది.

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   9 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   20 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle