పంపకాల్లో తేడాలు.. వైసీపీలో గొడవలు
26-11-202026-11-2020 16:41:22 IST
Updated On 26-11-2020 16:57:37 ISTUpdated On 26-11-20202020-11-26T11:11:22.122Z26-11-2020 2020-11-26T11:11:18.445Z - 2020-11-26T11:27:37.542Z - 26-11-2020

వైసీపీకి బయటి నుంచి అపొనెంట్లు అవసరం లేదు. వాళ్లలో వాళ్లు చాలు. కొంప కొల్లేరు చేసేలా ఉన్నారేంటయ్యా అని తూర్పుగోదావరి జిల్లా నేతలపై సీరియస్ అవుతున్నారు సీనియర్లు. ఏ అధికారిక సమావేశం అయినా సరే.. అక్కడ ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే తప్పడం లేదు. లీడర్లకీ లీడర్లకీ మధ్య హీట్ ఫుల్లుగా ఉంటోంది. ఇక్కడ సల్లబడాలంటే ఫ్యాన్ గాలి సరిపోయేలా లేదు. మొన్నీ మధ్య జరిగిన అధికారిక సమావేశంలో ఇష్యూ కావడంతో.. ఏకంగా సీఎం జగన్ దగ్గరికి పోయింది ఇష్యూ.. ఇద్దరు లీడర్లని పిలిచి తలంటి పోశారట సీఎం జగన్. అసలు ఎందుకీ గొడవ అంటే.. వర్గ పోరు. సీనియర్లు జూనియర్లు అనే ఇష్యూ.. కాకినాడ ఎమ్మెల్యేకి అక్కడ బలం ఉండడం.. మినిస్టర్ల సపోర్ట్ ఉండడంతో ఏ మాత్రం తగ్గడం లేదట. ఎప్పటి నుంచో ఈ ఇష్యూ పార్టీలో అలాగే ఉంది. ఈసారి ఎంపీపై గొడవకి దిగడంతో పెద్దదైంది. కానీ.. బయటికి మాత్రం ఇంకోలా వినిపిస్తుంది. ఇది వర్గపోరు కాదు.. సీనియర్ల జూనియర్ల ఇష్యూ అంతకన్నా కాదు.. మొత్తం పంపకాల్లో పొత్తుగూడకనే అంటున్నారు. అవునేమో.. తూర్పుగోదావరి పెద్ద జిల్లా.. 19 మంది ఎమ్మెల్యేలు.. అందులో అధికార పార్టీ వాళ్లే.. 15 మంది ఎమ్మెల్యేలు. పైగా ముగ్గురు మినిస్టర్లు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్ని కాస్త సైడ్ చేసినా.. 15 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు మినిస్టర్లు.. ఒక ఎంపీ. వీళ్లందరూ కలిసి.. జిల్లాని పంచుకోవాలి. నిధులు పంచుకోవాలి. వాటిని దోచుకోవాలి..వాటిలో దాచుకోవాలి.. వాళ్లకి వాళ్లకి పోంగ.. మిగిలినవి జనం మొహాన పడేస్తారు అంటూ.. నేరుగా మాట్లాడుతున్నారు లీడర్లు. అపొనెంట్లు ఆడేసుకుంటున్నారు కూడా. అయినా సరే.. పంపకాల్లో పొత్తులు గూడక.. బహిరంగంగా ఫైటింగుల దాకా వస్తుంది ఎవ్వారం. మరీ ఇంతలా మారిపోయారేంటి అనే మాటలు చాలానే ఉన్నయ్. మరి మొన్న తలంటినా.. ఇష్యూ అయితే తగ్గడం లేదని తెలుస్తోంది. ముందు ముందు రోజుల్లో ఇంకెన్ని ఉంటాయో చూడాలి. ఇది చదవండి: ఏపీలో అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్న కొత్త జిల్లాల ప్రక్రియ!

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
3 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
8 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
9 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
7 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
10 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
5 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
3 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
11 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
10 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
8 hours ago
ఇంకా