newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

పంచాయతీ ఎన్నికల్లో విజయం వైసీపీదే - జేసీ దివాకర్ రెడ్డి

23-02-202123-02-2021 14:54:24 IST
Updated On 23-02-2021 15:15:53 ISTUpdated On 23-02-20212021-02-23T09:24:24.104Z23-02-2021 2021-02-23T08:10:35.850Z - 2021-02-23T09:45:53.034Z - 23-02-2021

పంచాయతీ ఎన్నికల్లో విజయం వైసీపీదే - జేసీ దివాకర్ రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి చాలా స్థానాలు వచ్చాయని ఆ పార్టీ నాయకులు చెబుతూ వచ్చారు. నారా లోకేష్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ ఎన్నికల్లో తమదే విజయం అని చెప్పారు. కానీ టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం పంచాయతీ ఎన్నికల్లో విజయం వైసీపీదే అని అంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, జగన్ ఒకరోజు ఆదాయం రూ. 300 కోట్లని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో వాస్తవం తనకు తెలియదని, ప్రజలు మాత్రం జగన్ సంపాదనపై చర్చించుకుంటున్నారని అన్నారు. వాస్తవానికి కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంతో బాగా అభివృద్ధి చేశారని.. వైసీపీ ఇచ్చినంత డబ్బును ఇవ్వలేక ఓడిపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు.

అధికార పార్టీ ధన బలానికి పోలీసులు కూడా తోడయ్యారని అన్నారు. అందుకే ఎన్నికల్లో జగన్ బ్యాచ్ అధిక విజయాలు సాధించిందన్నారు. చంద్రబాబు ఎటువంటి వ్యక్తో, జగన్ ఎటువంటి వ్యక్తో ప్రజలకు తెలుసునని అన్నారు. డబ్బు ప్రభావంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తోందని, అభివృద్ధిని చూసి ప్రజలు అండగా ఉంటున్నారని ఆ పార్టీ నేతలు చేసుకుంటున్న ప్రచారం అవాస్తవమని తేల్చేశారు. అదంతా దొంగ మాట అన్నారు. డబ్బులు లేనిదే ఎన్నికల్లో ఎవరూ గెలవలేరని.. డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో గెలుపొందుతున్నారని అన్నారు.

ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని.. వాళ్లే ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ప్రతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావంతోనే ఎన్నికల్లో జగన్‌ గెలుస్తారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను బాగా అభివృద్ధి చేశారని.. డబ్బులు పంచలేకే ఓడిపోయారన్నారు. అక్కడ అధికార పార్టీ డబ్బుకు తోడు పోలీసులు కూడా భయబ్రాంతులకు గురిచేశారన్నారు.

రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ వైసీపీ పతనానికి ఇది ఆరంభం మాత్రమేనని.. ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని చెప్పారు. దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని అన్నారు. పంచాయతీ ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా జరిగి ఉంటే టీడీపీకి మరో 10 శాతం ఫలితాలు పెరిగేవని చంద్రబాబు చెప్పారు. అదే జరిగి ఉంటే వైసీపీ ఇప్పుడే పతనమై ఉండేదని అన్నారు.

అధికార దుర్వినియోగంపై ఆధారపడి వైసీపీ ఎక్కువ శాతం స్థానాలను గెలుచుకుందని.. పోలీసులు ఉంటేనే వైసీపీ నేతలు ప్రతాపం చూపుతారని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని చంద్రబాబు ప్రశంసించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పోరాటం చేశారని అన్నారు. అన్ని చోట్లా ఏకగ్రీవాలు చేసుకోవాలనుకున్న వైసీపీ కుట్రలు సాగలేదని చెప్పారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle