దేవినేని ఉమ విడుదల..!
19-01-202119-01-2021 19:11:12 IST
2021-01-19T13:41:12.876Z19-01-2021 2021-01-19T13:41:02.339Z - - 07-03-2021

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. తాను ఎప్పుడైనా సరే గొల్లపూడికి వస్తానని, ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో, సీఎం జగన్ ఏం చేశారో చెబుతానని గొల్లపూడిలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ మంత్రి కొడాలి నాని పాల్గొని వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమ ఇంట్లో అయినా సరే తాను చర్చకు రెడీ అని సవాల్ విసిరారు. దీంతో చర్చకు రావాలంటూ ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు ఈ రోజు దేవినేని ఉమ వెళ్లారు. దీంతో దేవినేని ఉమకు అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. మీ బూతుల మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కూర్చుంటా అంటే ఎందుకంత భయం? టచ్ చేస్తామని సవాల్ చేసి ఒక్కడికోసం వేలమంది పోలీసులను పంపిస్తావా? మీ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు ప్రజలు భయపడరు. ప్రజాబలాన్ని అధికార దుర్వినియోగంతో అడ్డుకోలేరని తెలుసుకోండి వైఎస్ జగన్ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు టీడీపీ శ్రేణులతో కలిసి ఉమా చేరుకున్నారు. ఉమా దీక్షకు సిద్ధమవుతుండగా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ శ్రేణులతో అక్కడికి చేరుకున్నారు. తీవ్ర గందరగోళం మధ్య దేవినేని ఉమా ఎన్టీఆర్ విగ్రహం వద్ద బైఠాయించారు. ఈ కారణంగా పరిస్థితిని అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు ఉమాను అరెస్టు చేశారు. పోలీసు వాహనంలో స్టేషన్కు తరలిస్తుండగా, ఈలప్రోలు వద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో మహిళలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం పలు నాటకీయ పరిణామాల మధ్య పమిడిముక్కల పీఎస్ కు తరలించారు. తొలుత గొల్లపూడి నుంచి పోలీసుల కాన్వాయ్ ఈలప్రోలు దిశగా వెళ్లడంతో ఉమను మైలవరం కానీ, ఇబ్రహీంపట్నం కానీ తీసుకెళతారని టీడీపీ శ్రేణులు భావించాయి. ఉమను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఆ వెంటనే ఆయనను పమిడిముక్కల పీఎస్ కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పమిడిముక్కల పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యుడు శ్రీరాం తాతయ్య, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు పలు యత్నాలు చేశారు. చివరికి ఉమను ఈ సాయంత్రం విడుదల చేశారు. ఉమ విడుదలతో అక్కడున్న టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు.

బలంగా ప్రతి పక్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్పదా
32 minutes ago

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
8 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
9 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
16 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
15 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
17 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
17 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
19 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
a day ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
a day ago
ఇంకా