newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

30-09-202030-09-2020 09:59:25 IST
Updated On 30-09-2020 10:30:09 ISTUpdated On 30-09-20202020-09-30T04:29:25.726Z30-09-2020 2020-09-30T04:29:20.984Z - 2020-09-30T05:00:09.067Z - 30-09-2020

దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

దేశంలో పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా బీజీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పురంధేశ్వరి చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఇటీవల పార్టీ అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. ఆమె ఇటీవల కాస్త అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పాజిటివ్ అని నిర్దారణ కావడంతో ఆమె ట్రీట్మెంట్ కోసం కామినేని హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు కార్యాలయ వర్గాలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాయి. మంగళవారం ఉదయం రొటీన్ టెస్టుల్లో భాగంగా ఆయనకు కోవిడ్-19 టెస్ట్ చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిజానికి అయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా టెస్టులలో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లుగా కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆయన సతీమణి ఉషానాయుడుకు నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లుగా కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం వెంకయ్య భార్యతో సహా కుటుంబ సభ్యులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటించగా వెంకయ్యకు కరోనా పాజిటివ్ రావడంపై ఆయన కుమార్తె దీపా వెంకట్ స్పందించారు. రొటీన్ టెస్టులలో పాజిటివ్ నిర్ధారణ అయిందని.. నాన్నగారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, వైరల్‌ లోడ్‌ చాలా తక్కువగా ఉందని ఆమె చెప్పారు. 

కేంద్రంలో కూడా పలువురు బీజేపీ నాయకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వారందరూ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. కేబినెట్ లోని మంత్రులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle