newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం.. స్కూళ్లు మరింత ఆలస్యం!

29-10-202029-10-2020 08:02:45 IST
Updated On 29-10-2020 08:11:37 ISTUpdated On 29-10-20202020-10-29T02:32:45.043Z29-10-2020 2020-10-29T02:31:25.760Z - 2020-10-29T02:41:37.297Z - 29-10-2020

పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం.. స్కూళ్లు మరింత ఆలస్యం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నవంబర్ 30వరకు అన్ లాక్ నిబంధనల పొడిగింపును కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పాఠశాలల పున:ప్రారంభంపై మళ్లీ సంధిగ్ధత నెలకొంది. వాస్తవానికి గతంలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని అధికారులు యోచించారు. పది రోజుల కిందట జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో.. దసరా తర్వాత మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. అయితే కేంద్రం జారీ చేసిన అన్‌లాక్‌–5 నిబంధనల్లో పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని, అయితే కేంద్రం పేర్కొన్న నిబంధనలను పక్కాగా అమలు చేయాలని పేర్కొంది.

రాష్ట్రంలో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేనట్లే. ఆరంభం మరింత ఆలస్యమయ్యేట్టు ఉంది. అన్‌‌లాక్‌ నిబంధనల పొడగింపుతో స్కూళ్ల పునఃప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. అన్‌లాక్‌–5 నిబంధనలను నవంబర్‌ నెలాఖరు వరకు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసిన తర్వాత విద్యాసంస్థల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని, ఆన్‌లైన్‌ దూరవిద్యా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. 

తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలని, హాజరును తప్పనిసరి చేయకూడదని స్పష్టం చేసింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో అవే నిబంధనలను మరో నెల రోజులపాటు పొడిగించడంతో నవంబర్‌ మొదటివారంలో పాఠశాలలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇంజనీరింగ్‌ వంటి సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల తరగతులను డిసెంబర్‌ 1 లోగా ప్రారంభించుకోవచ్చని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పేర్కొన్న సంగతి తెలిసిందే. 

సినిమాలు, థియేటర్లు, మల్టీప్లెక్సులు, వ్యాపార సంస్థలు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు తదితర బహిరంగ స్థలాలను పరిమితుల మేరకు తెరవవచ్చని అక్టోబర్ 15న నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వం పాఠశాలలు, కోచింగ్ సంస్థలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల విషయంలో ఆయా రాష్ట్రప్రభుత్వాలే పరిస్థితులకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం మెలిక పెట్టింది. పైగా తల్లిదండ్రుల అనుమతి తర్వాతే విద్యార్థులను పాఠశాలల్లో అనుమతించాలని ఆంక్ష పెట్టింది. 

ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్ లైన్ విద్యే క్షేమకరమని భావిస్తున్నందున పాఠశాలల పున:ప్రారంభం ఇంకాస్త ఆలస్యం కావచ్చనిపిస్తోంది.

 

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   7 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   8 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   9 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   9 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   10 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   10 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   10 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   11 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   11 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle