newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

19-04-202119-04-2021 13:39:19 IST
2021-04-19T08:09:19.960Z19-04-2021 2021-04-19T08:06:58.487Z - - 15-05-2021

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చిత్తూరు జిల్లా పీలేరు సబ్‌జైలులో జుడిషియల్‌ కస్టడీలో ఉన్న జడ్జి రామకృష్ణకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జైలు అధికారులు తెలిపారు. ఆయనను ప్రత్యేక చికిత్స కోసం ఆదివారం సాయంత్రం చిత్తూరు కొవిడ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బెడ్లు ఖాళీ లేవని చెప్పడంతో అక్కడ్నుంచి తిరుపతిలోని శ్రీపద్మావతి రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.

జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ  మీడియాతో మాట్లాడుతూ రిమాండ్ రోజున తన తండ్రికి అధికారులు పాజిటివ్ అని చెప్పారని.. మళ్లీ ఇప్పుడు పాజిటివ్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. పాజిటివ్ వచ్చిందంటూ హడావిడిగా పీలేరు సబ్ జైలు నుంచి చిత్తూరుకు, మళ్లీ అక్కడి నుంచి తిరుపతికి ఆరు గంటల సేపు అంబులెన్స్‌లో తిప్పి చివరకు తిరుపతిలో హాస్పిటల్లో జాయిన్ చేశారన్నారు. ప్రభుత్వ వైద్యంపై తమకు నమ్మకం లేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం అనుమతి ఇవ్వాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. తన తండ్రికి ఏదైనా జరగరానిది జరిగితే అందుకు బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలే వహించాల్సి ఉంటుందని వంశీకృష్ణ మీడియాతో చెప్పుకొచ్చారు. 

 ఈ నెల 12న రాత్రి ఒక టీవీ డిబేట్‌లో జడ్జి రామకృష్ణ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విద్వేషాలు రగిల్చే విధంగా వ్యాఖ్యానించారని కేవీపల్లె మాజీ జడ్పీటీసీ జయరామచంద్రయ్య ఫిర్యాదు చేశారు. దీంతో పీలేరు పోలీసులు 15న రామకృష్ణను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టు సందర్భంగా పోలీసులు ఆయనకు కరోనా పరీక్ష చేయించగా ఆదివారం పాజిటివ్‌ అని రిపోర్టు వచ్చింది. వెంటనే ఆయనకు పీపీఈ కిట్‌ ధరింపజేసి ప్రత్యేక ఎస్కార్టుతో కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.  ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేశారు. రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో కరోనా పరీక్షల కోసం మదనపల్లె వెళ్తుండగా.. మార్గ మధ్యలో పీలేరు ఎన్టీఆర్‌ కూడలి దగ్గర ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దాంతో జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌జైలుకు తరలించారు. ఏప్రిల్‌ 12న ఓ టీవీ ఛానల్‌లో నిర్వహించిన చర్చలో రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ‘జగన్‌ మోహన్‌రెడ్డి కంసుడిలా తయారయ్యాడు. ఈ రాక్షసుడిని, రాక్షస పాలనను అంతం చేయడానికి.. నేను కృష్ణుడిగా భావించి.. నరకాసురుడు, కంసుడైనటువంటి జగన్‌మోహన్‌రెడ్డిని ఎప్పుడు శిక్షించాలా అని ఎదురు చూస్తున్నాను’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle