newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

15-04-202115-04-2021 13:38:11 IST
Updated On 15-04-2021 13:38:08 ISTUpdated On 15-04-20212021-04-15T08:08:11.628Z15-04-2021 2021-04-15T08:02:42.870Z - 2021-04-15T08:08:08.491Z - 15-04-2021

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలతో వైద్య మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. వచ్చే ఆరు వారాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, గతం కంటే ఎక్కువ వేగంతో కరోనా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.  అన్ని ఆసుపత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేయాలని.. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. 

14-04-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గత 24 గంటల్లో 35,732 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 4,157 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 617 కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమ గోదావరి గోదావరి జిల్లాలో అత్యల్పంగా 60 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18 మంది కరోనా వల్ల మృతి చెందారు. అలాగే, 1,606 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 9,37,049కి పెరిగింది. మరణాల సంఖ్య 7,339కి చేరుకుంది. ఇప్పటి వరకు 9,01,327 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

టీకాల కొరత.. ప్రభుత్వం చెబుతోంది ఇదే..!

ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతూ ఉంది.  ఒక్క రోజే ఏకంగా 6,17,182 మందికి టీకాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 68,358 మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో అత్యల్పంగా 34,048 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు రోజుకు సగటున 1.25 లక్షల మందికి మాత్రమే టీకా పంపిణీ జరగ్గా, నిన్న రికార్డుస్థాయిలో టీకాలు వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కేంద్రం నుంచి వచ్చిన 6.40 లక్షల కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను పంపిణీ చేసినట్టు తెలిపింది. ఒక్క రోజులో ఇన్ని లక్షల టీకాలు ఇవ్వడం దేశంలోనే ఇది తొలిసారని చెబుతున్నారు ఏపీ అధికారులు. 

 

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   18 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   41 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle