అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-2)
27-11-202027-11-2020 08:14:43 IST
Updated On 27-11-2020 08:31:37 ISTUpdated On 27-11-20202020-11-27T02:44:43.353Z27-11-2020 2020-11-27T02:40:11.130Z - 2020-11-27T03:01:37.984Z - 27-11-2020

ఎన్నో అనుమానాలకు దారితీస్తున్న ఏపీ ప్రభుత్వం గుజరాత్ కంపెనీ అమూల్ తో ఒప్పందంలో భాగంగా మొదటగా మూడు జిల్లాలలో రైతుబరోసా కేంద్రాల వద్ద పాలసేకరణకోసం ప్రారంభిస్తున్న సెంటర్లలో పరికరాలు, బల్క్ చిల్లింగ్ సెంటర్ల కోరకు ప్రభుత్వం మొత్తం 1500 కోట్లు కేటాయించారు. అయితే, అదే డబ్బుతో ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న సహకార డైరీల అభివృద్ధి ఎందుకు చేయకూడదు? గతంలో ఈ డైరీలు అన్నీ ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా పోటీపడి లాభాలను తెచ్చిపెట్టాయి. ఆ లాభాలు కూడా రైతులకే వాటాలు వెళ్తాయి కనుక గ్రామాలలో రైతులు ఈ సహకార కేంద్రాలను తమ సొంత సంస్థగానే భావించి ఇక్కడే పాలను అందించేవారు. మరి అలాంటి మాతృ సంస్థలు కనుమరుగయ్యేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక మతలబు ఏంటి? కొత్తగా భరోసా కేంద్రాల వద్ద పరికరాల కోనుగోలు, డైరీల ఆధునీకరణలలో కమీషన్ ల కోసం ప్రభుత్వ పెద్దలు, వారి అనుచరులు ఈ నిర్ణయానికి తెగబడ్డారా? అధిష్టానం స్థాయిలో అమూల్ తో ఒప్పందం నుండి రైతు భరోసా కేంద్రాల వద్ద సేకరణ కేంద్రాల ఏర్పాటు వరకు అంతా కమీషన్ల లోగుట్టేనా అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒప్పందం అమలు చేస్తున్న మూడు జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ప్రభుత్వరంగ డైరీల పాల సేకరణ కేంద్రాల కోసం పక్కా భవనాలు కలిగి ఉన్నాయి. అవన్నీ సహకార డైరీల ఆస్తులే. పాడి రైతుల ద్వారా వచ్చిన ఆదాయంతో నిర్మించిన ఆస్తులే. మరి వాటిని పక్కనపెట్టి మళ్ళీ కొత్తగా రైతు భరోసా కేంద్రాల వద్ద సెంటర్ల ఏర్పాటు ఎవరి కోసం? వాటాల కోసమా అని పాడి రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ రంగ సహకార డైరీలు వృద్ధి చెంది, లాభాల బాట పడితే అది పాడి రైతులకు మేలు అవుతుంది. కానీ ఇక్కడ గుజరాత్ కంపెనీకి మేలు జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పాలసోసైటీల ఆస్తులను, శీతలీకణ సెంటర్ల వినియోగం పెంచి ఆధునీకరించి, రైతులకు ప్రోత్సహకాలిస్తే సహజంగానే ఉత్పత్తి పెరుగుతుంది. కొంత నిధులు వెచ్చిస్తే మార్కెటింగ్ కూడా వృద్ధి చెందుతుంది. తద్వారా డైరీ సిబ్బంది, పాడిరైతుల ప్రయోజనాలను కాపాడుతూ సహాకార డైరీల సామర్ధ్యాన్ని పెంచవచ్చు. అలా చేస్తే ప్రభుత్వ రంగంలో మరో నమ్మకమైన, ప్రజల కోసం.. ప్రజలతో నడిచే సంస్థగా మారుతుంది. లాభాలలో వాటాలు రైతులు, ప్రభుత్వమే వెనక్కు తీసుకొనే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన అమూల్ ఒప్పందం ఎవరికి మేలన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన రెండు దారుణమైన అంశాలు ఏమిటంటే.. ఒకటి ఈ కేంద్రాల వద్ద పాడి రైతులు పాలు ఇస్తే ప్రైవేట్ డైరీల కన్నా లీటరుకు రెండు రూపాయల ధర అధికంగా ఇవ్వనున్నారు. రైతులకు అదనపు చెల్లింపు మంచిదే కదా అనుకుంటున్నారా.. ఆ రెండు రూపాయలు ప్రజా ధనాన్ని ప్రభుత్వం చెల్లింపు చేయనుంది. అలా సేకరించిన పాలను అమూల్ సంస్థ వ్యాపార అభివృద్ధికి కట్టబెడుతుంది. మరో దారుణ అంశం ఏమిటంటే గ్రామాలలో రైతులు ఎవరైనా ఈ కేంద్రాలకు పాలు ఇవ్వలేము అంటే వారికి ప్రభుత్వ పథకాలలో కోత విధిస్తామని స్థానిక అధికార పార్టీ నేతలు, సచివాలయ ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేస్తున్నట్లుగా ఈ మూడు జిల్లాలలో వినిపిస్తుంది. ఇది చదవండి: అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
3 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
2 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
4 hours ago

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?
14 minutes ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
19 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
21 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
12 hours ago
ఇంకా