అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)
26-11-202026-11-2020 20:04:19 IST
Updated On 27-11-2020 08:33:54 ISTUpdated On 27-11-20202020-11-26T14:34:19.058Z26-11-2020 2020-11-26T14:34:01.700Z - 2020-11-27T03:03:54.173Z - 27-11-2020

ఎక్కడో గుజరాత్లో పుట్టి.. దేశవ్యాప్తంగా వ్యాపార విస్తరణ చేసుకుంటూ లాభాలను గడించడమే దూసుకెళ్తున్న అమూల్ సంస్ధ గురువారం నుండి ఏపీలో అడుగుపెట్టబోతోంది. ఏ వ్యాపార సంస్థ అయినా లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తుంది. అందుకు అమూల్ అతీతం కావాలని మనం ఎందుకు కోరుకోవాలి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఓ ఫక్తు వ్యాపార సంస్థను తమ రాష్ట్రానికి ఆహ్వానించి.. ఇప్పటి వరకు ప్రభుత్వ హయాంలో నడుస్తున్న సహకార పాల డైరీలను ఆ సంస్థకు అప్పగించి ఏపీ ప్రజలకు మేలు చేయాలని చూస్తుంది. చూడండి మేలు జరుగుతుందని ప్రజలను నమ్మిస్తుంది కూడా. ఇందులో భాగంగానే ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తొలి దశలో మూడు జిల్లాల్లో అమూల్ కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆయా జిల్లాల్లోని (భవిష్యత్ లో అన్ని జిల్లాలు) ప్రభుత్వ డెయిరీల నుండి అమూల్ సంస్థ పాలను సేకరించి, మార్కెటింగ్ తో పాటు ఇతర వ్యవహారాలను చేపట్టబోతోంది. గ్రామాలు, పట్టణాలలో ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వ సహకార కేంద్రాల స్థానంలో ఇప్పుడు కొత్తగా జగన్ సర్కార్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి.. వాటి వేదికగా పాల సేకరణ జరిపి సహకార పాల డైరీల స్థానంలో కార్యకలాపాలు సాగిస్తున్న అమూల్ చేతికి అందిస్తుంది. అంతేకాదు.. ప్రస్తుతం మన రాష్ట్రంలో పాల వ్యాపారంలో దూసుకెళ్తున్న ప్రైవేట్ సంస్థల పోటీ తట్టుకొని పైచేయి సాధించేందుకు వీలుగా లీటర్ పాలకు రెండు రూపాయల అదనంగా ప్రభుత్వ సొమ్మును పాడి రైతులకు చెల్లించనుంది. అంటే ప్రభుత్వ డబ్బు అదనపు చెల్లింపులు చేసి, ప్రభుత్వ రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరణ జరిపి, సహకార కేంద్రాల ద్వారా ప్రోసెసింగ్ చేసి అమూల్ సంస్థకు వ్యాపారాన్ని అప్పగించనుంది. సహకార కేంద్రాలలో ప్రోసెసింగ్ కోసం పాత పద్దతులను పక్కనబెట్టి కొత్తగా 1500 కోట్లతో సరికొత్త అధునాతన పరికరాలను కొనుగోలు చేయనున్నారు. ఆ డబ్బు కూడా ప్రభుత్వమే చెల్లించనుండగా ఇప్పటికే కేటాయింపులు కూడా జరిగిపోయాయి. అంటే అమూల్ సంస్థ ఏపీకి ఖాళీ చేతులతో వచ్చి ప్రభుత్వ రాయితీలతో.. ప్రభుత్వ డబ్బుతో వ్యాపారం చేసుకోనుంది. ఈ ప్రాజెక్టును సీఎం జగన్ గురువారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనుండగా తొలిదశలో మూడు జిల్లాల్లో అమూల్ కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. ఆ తర్వాత మిగిలిన జిల్లాలకు వీటిని విస్తరిస్తారు. తొలి దశలో భాగంగా చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో అమూల్ స్ధానికంగా ఉన్న జిల్లా సహకార డెయిరీలతో కలిసి పాల ఉత్పత్తిలో మెరుగైన పద్ధతులను, మార్కెటింగ్ వ్యూహాలను రచించబోతోంది. ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే తమ తమ లాభార్జన వ్యాపార వ్యూహాలను ఈ సహారా డైరీలలో చూపించబోతుంది. అయితే, ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఈ అమూల్ తో ఒప్పందంపై చాలా కాలంగా వ్యాపార, పాడి పరిశ్రమ వర్గాలలో ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఈ ఒప్పందాన్ని పూర్తిగా విమర్శిస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ సహకార డైరీలు తీవ్ర నష్టాలలో కూరుకుపోయాయి. అందుకు కారణం గత ప్రభుత్వమే అని ఇప్పటి ప్రభుత్వం చెప్తుంది. అయితే, ఆ నష్టాల ఊబిలో డైరీలను ఆదుకొని గాడిన పెట్టాల్సిన ఈ ప్రభుత్వం గుజరాత్ కంపెనీకి ధారాదత్తం చేయడం ఏమిటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రైవేట్ సంస్థలకు పోటీ ఇచ్చేలా మార్పులు చేయాలని అందుకు అమూల్ సహకారం కోరామని పెద్దలు చెప్పుకున్నా.. మన రాష్ట్రంలో అంతకు మించి లాభాలను గడిస్తున్న ప్రైవేట్ డైరీలు కూడా ఉన్నాయి. ఆ డైరీలకు వచ్చే ఆదాయంలో రైతులకు వాటాలు ఇచ్చే ప్రైవేట్ డైరీలు కూడా ఉన్నాయి. మరి వాటి సహాయం ప్రభుత్వం ఎందుకు కోరలేదు? పైగా అమూల్ వ్యాపార క్రమబద్దీకరణకు ప్రభుత్వ సొమ్ముతో పరికరాల కొనుగోలు.. వ్యాపార వృద్ధి కోసం ప్రభుత్వ సొమ్ముతో రైతులకు అదనపు చెల్లింపులు ఎన్నో అనుమానాలకు దారి తీస్తుంది. ఇది చదవండి: అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-2)

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
3 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
8 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
9 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
7 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
10 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
5 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
4 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
11 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
11 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
9 hours ago
ఇంకా