newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

మంచిదే కానీ.. సీఎం జగన్ హెచ్చరిక

30-09-202030-09-2020 08:31:33 IST
Updated On 30-09-2020 12:29:10 ISTUpdated On 30-09-20202020-09-30T03:01:33.427Z30-09-2020 2020-09-30T03:01:22.881Z - 2020-09-30T06:59:10.227Z - 30-09-2020

మంచిదే కానీ.. సీఎం జగన్ హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమని, పాజిటివిటీ రేటు 8.3 శాతానికి తగ్గడం సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 56.66 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారని, కరోనా మరణాలు కూడా తగ్గాయన్నారు. ప్రస్తుతం కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. 

స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కోవిడ్‌–19 నివారణ చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మార్గనిర్దేశం చేశారు. కోవిడ్‌పై సమరంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పూర్తి వ్యతిరేక దృక్పథంతో విమర్శించినా ఆ విమర్శలను పట్టించుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. మనలో ఏమైనా లోపం ఉంటే సవరించుకుందాం. ఒకవేళ తప్పులు జరగకపోయినా రాస్తే, దానికి గట్టిగా సమాధానం చెప్పొచ్చని సూచించారు.

రాష్ట్రంలోని 240 కోవిడ్‌ ఆస్పత్రుల్లో దాదాపు 37 వేల బెడ్లు ఉన్నాయి. వాటిలో వైద్య సదుపాయాలు, ఆహారం నాణ్యత, శానిటేషన్, వైద్యుల అందుబాటుపై ఎప్పటికప్పుడు జేసీలు సమీక్షించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో పౌష్టికాహారం అందించాలనీ, వాటిలో కూడా హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేయాలనీ, ఆహార నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని సీఎం సూచించారు.

కోవిడ్‌ సమయంలో మెరుగైన వైద్య సేవలందించడం కోసం తాత్కాలిక ప్రాతిపదికన 6 నెలల కోసం వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది దాదాపు 17 వేల మంది నియామకానికి ఆదేశాలు జారీ చేశాం. వారితో పాటు మరో 12 వేల మంది శిక్షణ నర్సులను నియమించుకోవాలని చెప్పామని జగన్ గుర్తు చేశారు. 

ప్రస్తుతం ఏపీలో దాదాపు 20 వేల మంది సిబ్బంది నియామకం జరిగింది. ఈ వారం చివరిలోగా అందరి నియామకాలు పూర్తి చేయాలి. వారు ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారా విధులకు హాజరవుతున్నారా అన్నది చూడాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి అవసరమైన మందులతో కూడిన కిట్‌ను అందజేయాలి. ఎక్కడైనా అవి అందలేదంటే కలెక్టర్లు, జేసీలను బాధ్యులను చేస్తాము. 2 వారాల పాటు స్థానిక వైద్యాధికారి ఫోన్‌లో అందుబాటులో ఉండాలని సీఎం జగన్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

రాష్ట్రంలో 240 కోవిడ్‌ ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో నమోదైన ఆస్పత్రుల్లో కూడా కోవిడ్‌ చికిత్స చేయాలని ఆదేశించాం. ఏయే ఆస్పత్రులలో కోవిడ్‌ చికిత్స అందుతోందనే సమాచారం తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ సోకిన వారికి ఖర్చు లేకుండా చికిత్స చేయించడం మన బాధ్యత అని జగన్ చెప్పారు.

 

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   3 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   18 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   18 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

   25-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle