newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

26-10-202026-10-2020 08:43:05 IST
Updated On 26-10-2020 08:47:29 ISTUpdated On 26-10-20202020-10-26T03:13:05.707Z26-10-2020 2020-10-26T03:13:03.204Z - 2020-10-26T03:17:29.106Z - 26-10-2020

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలవరం వ్యయంపై కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులను ఢిల్లీకి పంపడం మాత్రమే కాకుండా అవసరమైతే తాను స్వయంగా ప్రధానికి అన్ని విషయాలను వివరిస్తూ లేఖ రాస్తానని, వీలైతే నేరుగా ప్రధానిని కలిసి ఈ విషయమై మాట్లాడతానని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఆర్‌సీసీ (అంచనా మదింపు కమిటీ), కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆమోదించిన మేరకు 2017–18 ధరల ప్రకారం నిధులను రాబట్టి.. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరం నిర్మాణ బాధ్యతను పూర్తిగా కేంద్రప్రభుత్వం తీసుకున్నా అభ్యంతరం లేదని జగన్ ఈ సందర్భంగా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం ఖర్చుతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా భరించి.. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని 2014లోనే కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం కూడా ప్రస్తావించారు. విభజన చట్టం, కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

2016 సెప్టెంబర్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో జరిపిన అంతర్గత చర్చల్లో.. పోలవరం ప్రాజెక్టుకు ఏప్రిల్‌ 1, 2014 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం పేర్కొన్న అంశాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు. ఏప్రిల్, 1, 2014 నాటి ధరల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే మంజూరు చేస్తామంటూ 2017 మార్చిలో కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసిందని ఎత్తిచూపారు. ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు వర్తింపజేస్తామనడం సమంజసం కాదన్నారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు సహాయ పునరావాసం కల్పించడానికే రూ.29 వేల కోట్లు వ్యయం అవుతుందని పీపీఏ, సీడబ్ల్యూసీ, ఆర్‌సీసీ, కేంద్ర జల్‌ శక్తి శాఖ అంచనా వేసి.. ఆమోదించాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ ఈ ప్యాకేజీకి రూ.20,398.61 కోట్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ చెప్పడం సమంజసం కాదన్నారు. ఆ నిధులతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని అన్నారు.  

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.4,013.65 కోట్లను కేంద్రం రీయింబర్స్‌మెంట్‌ చేయడం, దీనికి సంబంధించిన తాజా పరిణామాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్‌ 1 2014 నాటికి పోలవరం ప్రాజెక్టు నీటి పారుదల విభాగం వ్యయం 20,398.16 కోట్లుగా నిర్ధారించి ఆమోదించాలని కేంద్ర జలశక్తిశాఖ, పీపీఏకు కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేయాడాన్ని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను రీయింబర్స్‌ చేయడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చల వివరాలను వివరించారు.

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్‌ చేయడం ద్వారా ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి సహకరించాలని చేసిన విజ్ఞప్తిపై ఆమె సానుకూలంగా స్పందించారని చెప్పారు. పోలవరానికి రూ.2,234.288 కోట్లు రీయింబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రతిపాదించిన అంశాన్ని ఆమె గుర్తు చేశారని వివరించారు. ఏప్రిల్‌ 1, 2014 నాటికి పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం సవరించిన వ్యయం రూ.20,398.61 కోట్లుగా పేర్కొన్నారన్నారు. కాగా పీపీఏ, సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ),  2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా నిర్ధారించి, ఆమోదించిన అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించామని చెప్పారు. 

అలాగే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌సీసీ 2017–18 ధరల ప్రకారం పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా నిర్దారించి, ఆమోదించిన అంశాన్ని గుర్తు చేసినట్లు తెలిపారు. ఆర్‌సీసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లకు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆమోదం తెలిపి.. కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిన అంశాన్ని నిర్మలా సీతారామన్‌కు వివరించామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఆ ప్రతిపాదనల మేరకు నిధులను విడుదల చేసి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాల్సిందిగా కోరామని వివరించారు.

 

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   7 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   8 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   9 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   9 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   10 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   10 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   10 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   11 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   12 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle