newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

చిరువ్యాపారులకు వడ్డీ లేని రుణం ''తోడు'' ప్రారంభం

25-11-202025-11-2020 18:21:11 IST
2020-11-25T12:51:11.966Z25-11-2020 2020-11-25T12:50:27.718Z - - 09-03-2021

చిరువ్యాపారులకు వడ్డీ లేని రుణం ''తోడు'' ప్రారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించారు. బుధవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల మేరకు వడ్డీలేని రుణాలను ఆన్‌లైన్‌లో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈరోజు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. పలెల్లో, పట్టణాల్లో, వీధివీధికీ చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తున్న వారి కోసమే జగనన్న తోడు పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో చిరువ్యాపారుల కష్టాలు స్వయంగా చూసిన నేపథ్యంలో ఎలాంటి అధరువూ లేని వారికి ఆర్థిక సాయం చేసి తీరాలని నిర్ణయించుకున్నట్లు జగన్ తెలిపారు.

పాదయాత్రలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడుతున్నవారిని దగ్గరగా గమనించాను. టిఫిన్‌ అమ్ముకునేవారు, కూరగాయలు అమ్ముకునేవారు తెల్లవారుజామున 4 గంటలకే సేవలు అందిస్తారు. ఎండకు, వానకు, చలికి తట్టుకుని కూరగాయలు, పూలు అమ్మేవాళ్లు... ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు అందిస్తన్నవారికి ఈ స్కీం. మోపెడ్లపై దుస్తులు, సామాన్లు అమ్ముకునేవారు గానీ, బండ్లపై టిఫిన్లు అమ్ముకునేవారి సేవలు లేకపోతే అనేకమందికి గ్రామాల్లో, పట్టణాల్లో కడుపునిండని పరిస్థితి ఉంటుంది. ఇంటిముందుకే వస్తువులు, సరుకులు వచ్చే పరిస్థితి ఉండదు అని జగన్ వివరించారు.

చిరువ్యాపారులకు తమ వ్యాపారంలో తీవ్ర పోటీ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద లాభాలు ఉండవు. శ్రమ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఈ వ్యాపారాలకు లోన్లు దొరక్క పెద్ద పెద్ద వడ్డీలకు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. వీరంతా స్వయం ఉపాధి పొందేవాళ్లే. అంతేకాదు వీలైతే ఒకరికో, ఇద్దరికో ఉపాధి కల్పిస్తారు. వస్తువులు, సరుకులు తెచ్చుకునే క్రమంలో ఆటోలు లాంటి వాటికి, కూలీలకు పని కల్పిస్తారు. 

పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి చూపిస్తున్నారు. అసంఘటిత రంగంలో వీరు పనిచేస్తున్నారు కాబట్టి, బ్యాంకులనుంచి కూడా రుణాలు అందే పరిస్థితి లేదు. పెట్టుబడికి డబ్బులు కావాలి అంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. తక్కువ వడ్డీకి పెట్టుబడి దొరికే పరిస్థితి కూడా లేదు. పెట్టుబడికి 3,4,5, కొన్ని సందర్భాల్లో 10 రూపాయల వడ్డీకి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి అని చిరువ్యాపారుల కష్టాలను సీఎం కళ్లకు కట్టినట్లు వివరించారు.

ఇలాంటి వారందరి జీవితాల్లో మార్పులు రావాలని పాదయాత్రలో వారిని చూసినప్పుడు అనుకున్నానని. వీరికి అన్నగా, తమ్ముడిగా...  చేయూత నివ్వాలని అనుకున్నానని. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని జగన్ తెలిపారు. గతంలో వీరి చేయిపట్టుకుని నడిపించే పరిస్థితి లేదు. వార్డుల్లో , గ్రామాల సచివాలయాల్లో వాలంటీర్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు వీరికి తోడుగా నిలబడుతున్నారు. లబ్ధిదారులను గుర్తించడం దగ్గర నుంచి, వీరి దరఖాస్తులు తీసుకోవడం దగ్గరనుంచి, బ్యాంకులతో మమేకం కావడం, రాష్ట్రస్థాయిలో బ్యాంకర్లతో మాట్లాడ్డం, వారిని ఒప్పించడం, పారదర్శక విధానంలో లబ్ధిదారులను గుర్తించాం. 

రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని వడ్డీ చెల్లించే బాధ్యత తీసుకుంటూ... నమ్మకం కలిగింది. బ్యాంకులు దాదాపుగా 10 లక్షలమందికి రూ.1000 కోట్లు ఇస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 100 కోట్ల రూపాయలు వడ్డీ కింద ఏడాదికి చెల్లిస్తుంది. పదేళ్లలో 1000 కోట్లు వడ్డీరూపంలోనే చెల్లిస్తుంది. అప్పులు పాలవుతారు, ఇబ్బందుల పాలు అవుతారని చిరు వ్యాపారులను అదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి వారికి తోడుగా నిలిచే కార్యక్రమం చేసింది. 

10 లక్షల మందికి దాదాపుగా రూ.1000 కోట్ల రూపాయలను వడ్డీలేని రుణాలకింద బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నాం. 7 నుంచి 10 రోజుల్లోనే దాదాపు 10లక్షలమంది బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున జమ అవుతుంది. గడువులోగా తిరిగి చెల్లిస్తే.. బ్యాంకులకు, చిన్న వ్యాపారాలకు, హస్తకళాకారులకు ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక్కసారి చెల్లించిన వారు తిరిగి వడ్డీలేని రుణాలు పొందడానిక అర్హులు. ఏడాదిలోగా కట్టేసిన వారికి తిరిగి వడ్డీలేని రుణాలు వస్తాయి. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని జగన్ వివరించారు.

రాకున్నా.. అర్హత ఉన్నవాళ్లందరికీ ఇస్తాం

లబ్ధిదారుల జాబితాను ఇదివరకే ప్రకటించాం. ఈ పథకంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే.. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మీపేరు ఉందో, లేదో చూసుకోండి. లేకపోతే దరఖాస్తు చేసుకోండి, పరిశీలన చేసి నెలా, 2 నెలల్లోపే వీరందరికీ కూడా న్యాయం జరుగుతుంది. నెలరోజుల వరకూ ఈస్కీం పొడిగించబడుతుంది. ఎవ్వరికీ కూడా ఎగరగొట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాలన్నదే ఆలోచన అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అరెస్టు చేసిన పోలీసులు

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అరెస్టు చేసిన పోలీసులు

   4 minutes ago


కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్

   2 hours ago


బీజేపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్.. భార్య ఒత్తిడే కార‌ణ‌మా

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్.. భార్య ఒత్తిడే కార‌ణ‌మా

   2 hours ago


విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ స‌ర్కార్ కు ముందే తెలుసు

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ స‌ర్కార్ కు ముందే తెలుసు

   4 hours ago


నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

   19 hours ago


కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

   21 hours ago


కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

   a day ago


వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

   a day ago


ఇదేం  అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

ఇదేం అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

   a day ago


దేశ వ్యాప్తంగా ఆ నియోజ‌క వ‌ర్గం గెలుపు పై ఫోక‌స్

దేశ వ్యాప్తంగా ఆ నియోజ‌క వ‌ర్గం గెలుపు పై ఫోక‌స్

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle