newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

నిప్పు రాజేసిన సీఎం జ‌గ‌న్..

11-10-202011-10-2020 14:39:31 IST
2020-10-11T09:09:31.228Z11-10-2020 2020-10-11T09:09:28.995Z - - 21-10-2020

నిప్పు రాజేసిన సీఎం జ‌గ‌న్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రాజ‌కీయం హీటెక్కింది. అది న్యాయ వ్య‌వ‌స్థ‌కి లింక్ అయి ఉంది. అది కూడా సుప్రీం కోర్టు కావ‌డంతో నేష‌న‌ల్ ఇష్యూ అయింది. ఇన్నాళ్లూ సైలెంట్ గానే ఉన్నాం.. ఇక మీద‌ట ఊరుకోం అన్న‌ట్లు ఉంది య‌వ్వారం. సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి సీఎం జ‌గ‌న్ రాసిన లేఖ‌తో పొలిటిక‌ల్ హీట్ కాస్త కోర్టులకి త‌గిలింది. సుప్రీం కోర్టు ఇష్యూ కావ‌డంతో నేష‌న‌ల్ వైడ్ గా వైబ్ వ‌చ్చింది. న్యాయ వాదులు, లీడ‌ర్లు, పెద్ద‌లు అంద‌రూ త‌లా ఓ మాట అంటున్నారు. ట్వీట్ల‌తో హీట్ పుట్టిస్తున్నారు.

సుప్రీం కోర్టు జ‌స్టిస్ అయిన ఎన్వీ ర‌మ‌ణ తీరు పై ఏపీ సీఎం జ‌గ‌న్.. సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి రాసిన లేఖ‌తో ఇష్యూ స్టార్ట్ అయింది. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ.. రాష్ట్ర హైకోర్టును ప్ర‌భావితం చేస్తున్నారు. ఇక్క‌డి న్యాయ‌మూర్తుల‌తో చంద్ర‌బాబుకి అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకునేలా చేస్తున్నార‌ని. త‌న ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెడుతూ ప్ర‌జ‌ల‌కి కావాల్సిన మంచి ప‌నులు కానివ్వ‌కుండా చేస్తున్నార‌ని. అన్నిటిపైనా స్టేలు ఇస్తూ ఆపుతున్నార‌ని లేఖ రాశారు సీఎం జ‌గ‌న్. గ‌తంలో టీడీపీ స‌ల‌హాదారుగా ప‌ని చేసిన ఎన్వీ ర‌మ‌ణ ఇప్పుడు సుప్రీం కోర్టు జ‌డ్జిగా ఉన్నారు. ఆ ప‌రిచ‌యాల‌తో టీడీపీ అండ్ జ‌స్టిస్ క‌లిసి.. ఏపీ ప్ర‌భుత్వాన్ని సీఎంను కావాల‌నే ఇబ్బంది పెడుతున్నార‌నేది లేఖ ఉద్దేశం. దాని కోసం రాష్ట్ర హైకోర్టులోని ఇద్ద‌రు జ‌డ్జిల స‌పోర్ట్ తీసుకుంటున్నార‌ని.. లేఖ రాశారు. దీనిపై సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి స్పందించి యాక్ష‌న్ తీసుకోవాని రిక్వ‌స్ట్ చేశారు.

సీఎం జ‌గ‌న్ రాసిన లేఖ‌తో త‌లో మాటా అంటున్నారు. సుప్రీం వ‌ర్సెస్ సీఎం అనే వాళ్లు.. జ‌గ‌న్ ఇక త‌గ్గేదే లేదు అనే వాళ్లు. లేఖ క‌రెక్ట్ కాదు అనే వాళ్లు ఉన్నారు. ఏపీలో పెద్ద క‌థే న‌డుస్తోంది అని కామెంట్స్ చేస్తున్న లీడ‌ర్లూ ఉన్నారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle