సీఎం జగన్ ప్రయాణం.. అధికారుల్లో టెన్షన్ టెన్షన్
13-02-202113-02-2021 15:35:04 IST
2021-02-13T10:05:04.620Z13-02-2021 2021-02-13T04:54:51.910Z - - 04-03-2021

ప్రభుత్వం తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు కాస్త గొడవలు లేపేలాగే ఉంటయ్. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలే.. విశాఖలో ఇష్యూ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. ఉప్పు నిప్పూ కలిసి పోయి భగ భగ మండిపోతుంది సాగర తీరం. ఈ టైంలో సీఎం అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలిసిందే కదా.
ఓ వైపు విశాఖ ఉక్కు ఉద్యమం ఉక్కులా మారింది. జనాలంతా కడుపు మంట మీదున్నారు. ఎమోషన్ బాండింగ్ అయిన.. విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు అంటూ.. మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మరోసారి ఎత్తుకుని.. ఆనాడు చనిపోయిన అమరుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటున్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలి అంటే.. ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు వ్యాపారుల చేతిలోకి వెళ్లడానికి వీళ్లేదు అంటున్నారు. ఎంత దాకా అయినా తెగిస్తాం అని గొడవ దిగుతున్నారు. అలాగే.. 40 వేల మంది ఉద్యోగుల బతుకు పై ఎఫెక్ట్ పడుతుందని ఆవేధన చెందుతున్నారు.
అలాంటి టైంలో.. శారదా పీఠం దర్శనానికి విశాఖ వెళ్తున్నారు సీఎం జగన్. స్వరూపా నందేంద్ర స్వామి ఆహ్వానం కొద్దిరోజుల కింద తీసుకున్న జగన్.. ఈనెల 17న శారదా పీఠానికి వెళ్తున్నారు. అఫ్ కోర్స్.. సీఎం జగన్ వెళ్లడంలో తప్పేముంది చెప్పండి. ఇది ముందే రెడీ అయిన షెడ్యూల్ కావచ్చు కూడా. అయినా సరే.. ఆందోళన పెరిగిన విశాఖ జగన్ వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పాయింట్. అసలే.. వైసీపీనే విశాఖ ఉక్కుని బేరం పెట్టింది అనే మాట జనంలో బాగా చేరిపోయింది. ఇలాంటి టైంలో.. సీఎం విశాఖ ట్రిప్ పై అధికారుల్లో టెన్షన్ పెరిగింది. పైగా.. ఈనెల 18న ఆమరణ నిరాహార దీక్షలు ప్లాన్ చేస్తున్నారు. ఆ దీక్షలకి ముందు రోజు జగన్ ప్రయాణం అంటే.. కాస్త కష్టమే. చూడాలి. ఎలా ఉంటుందో సిచ్చువేషన్.

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
an hour ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
an hour ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
3 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
2 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
15 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
16 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
21 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago

జగన్ కి పాలన రాదు అనే మాటకి నిదర్శనాలు ఇవేనా
19 hours ago

టీడీపీకి కర్నూలులో మరో పెద్ద నాయకుడు దూరం..!
a day ago
ఇంకా