newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?

11-04-202111-04-2021 17:38:39 IST
2021-04-11T12:08:39.172Z11-04-2021 2021-04-11T03:36:30.745Z - - 15-05-2021

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సీఎం వైఎస్‌ జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. శనివారం కర్నూలు జిల్లా లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.నారాయణరెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు. దేవినేని ఉమా ఈ నెల 7న తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి సీఎం జగన్‌కు తిరుపతి అంటే ఇష్టం లేదనే విధంగా మాట్లాడడంతోపాటు నకిలీ వీడియోను ప్రదర్శించారని.. దాన్ని తన ట్విట్టర్‌లోనూ పెట్టారని ఫిర్యాదులో తెలిపారు. సీఎం అనని మాటలను అన్నట్లు మార్ఫింగ్‌ చేసి బురద చల్లే ప్రయత్నం చేసిన ఉమాపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరారు. 

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ట్విట్టర్ లో' ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండంటే ఎవరూ రారు' అని జగన్ అన్నట్టున్న ఓ వీడియోను పోస్టు చేశారు. ‘‘ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండి అంటే ఎవరూ ఉండరు.. ఏ వ్యక్తీ ఒడిషాలో ఉండడానికో.. బీహార్ లో ఉండడానికో.. తిరుపతిలో ఉండడానికో ఇష్టపడడు.. అంటూ గతంలో తిరుపతిని కించపరిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తిరుపతి పార్లమెంట్ లో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది?’’ అని  ఓ వీడియోను దేవినేని ట్వీట్ చేశారు. అయితే అది మార్ఫింగ్ వీడియో అని తెలుస్తోంది. ఆ వీడియో వైరల్ కావడంతో ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దేవినేని పోస్ట్ చేసిన తప్పుడు వీడియో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా  ఉందని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై తిరుపతిలో కార్డియాలజీ (హృదయ సంబంధ వ్యాధులు) విభాగం ఏర్పాటుకు సంబంధించి జగన్ మాటలను వక్రీకరించి ప్రస్తుత వీడియోకు జత చేశారని తెలిపింది. 

దేవినేని ఉమ షేర్ చేసిన ఫేక్ వీడియోకు సంబంధించి అసలైన వీడియోలను పోస్ట్ చేసింది. దేవినేని పోస్ట్ చేసిన వీడియోను ప్రభుత్వంలోని నిజనిర్ధారణ బృందం ఫేక్ అని తేల్చినట్టు వెల్లడించింది. మార్ఫింగ్ చేసిన వీడియోకు సంబంధించిన అసలైన వీడియో గత ఏడాది మే 26 నాటిదని పేర్కొంది. నాడు ఢిల్లీకి వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారని, ఆ వీడియోను ఎడిట్ చేసి ఆరేళ్ల క్రితం నాటి జగన్ వ్యాఖ్యలను జోడించారని తెలిపింది. సీఎం జగన్ గత ఏడాది ఢిల్లీ పర్యటన, 2014 ఏప్రిల్ 13 నాటి ఒరిజినల్ వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దేవినేనిపై చర్యల కోసం ఆ వీడియోలను సంబంధిత అధికారులకు పంపించినట్టు తెలిపింది.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle