వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
08-03-202108-03-2021 14:29:34 IST
2021-03-08T08:59:34.731Z08-03-2021 2021-03-08T08:59:19.980Z - - 11-04-2021

ఏపీలో పాలిటిక్స్ ఏ రేంజ్ హీట్ ఉందో తెలిసిందే కదా. ఇప్పుడు ఇంకాస్త హీట్ మీదుంది. మున్సిపల్ ఎన్నికలు కావడంతో.. లీడర్లంతా బిజీ బిజీగా ఉన్నారు. ఇవ్వాళ అయితే.. ఇంకాస్త ఎక్కువ స్పీడ్ పెంచారు. ఎందుకంటే.. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవ్వాళే లాస్ట్ డేట్. సాయంత్రం నుంచి ప్రచార రథాలు ఆగిపోవాలి కదా.
ఇక పోతే.. అన్ని పార్టీలూ పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉన్నాయి. విశాఖ పై అన్ని పార్టీలూ ఎక్కువ ఫోకస్ చేశాయి. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠానికి ఎంత డిమాండ్ ఉంటుందో తెలిసిందే కదా. అందుకే.. స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉన్నా సరే.. అధికార పార్టీ జనంలోకి వెళ్లింది. బీజేపీ, జనసేనలు మాత్రం.. ఏదో నామ మాత్రంగా నడిపించాయి. టీడీపీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రత్యేకంగా మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేసిన టీడీపీ.. ప్లాన్ ప్రకారం ముందుకెళ్లింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఇష్యూని రెయిజ్ చేసిన టీడీపీ మైలేజీ తెచ్చుకుంది. ఇక చివరి రోజు గుంటూరులో రోడ్ షో నిర్వహించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
వైసీపీ రౌడీ రాజకీయాలపై చంద్రబాబు మరోసారి సీరియస్ అయ్యారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. వైసీపీ రౌడీ రాజకీయాలకు చెక్ పెడతామన్నారు బాబు. ఎవరి ముందు రౌడీ రాజ్యం నడిచినా.. తన ముందు అలాంటి ఆటలు సాగవు అంటూ ఘాటు కామెంట్స్ చేశారు బాబు. రాష్ట్ర భవిష్యత్ కోసం.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేయాలని కోరారు చంద్రబాబు. టీడీపీకి ఓటు వేసి.. అధికార పార్టీ వైసీపీ చేస్తున్న రౌడీ రాజకీయాలకు బ్రేక్ వేయాలన్నారు. జనంలో వైసీపీ పై ఎంత వ్యతిరేకత ఉందో.. విశాఖ పర్యటనలో తెలిసిందన్న బాబు.. వైసీపీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెబుతాం అన్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
14 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
21 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా