newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

నేనేం త‌ప్పు చేశా, మీకేంటి ఆ పూన‌కం- చంద్ర‌బాబు

13-01-202113-01-2021 10:10:51 IST
2021-01-13T04:40:51.032Z13-01-2021 2021-01-13T04:40:18.955Z - - 24-01-2021

నేనేం త‌ప్పు చేశా, మీకేంటి ఆ పూన‌కం- చంద్ర‌బాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేశారని.... తానేం తప్పు చేసానో తనకు తెలీదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశానని...అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని కోరారు. పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో  పాల్గొన్న చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు.  మీడియాతో మాట్లాడుతూ  రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరన్నారు. రైతు కూలీలు చితికిపోయారని తెలిపారు. ప్రజావ్యతిరేకతపై నిర్ణయాలు మీద నిర్ణయాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. 7వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని... అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానని అడ్డంగా దొరికిన దొంగఅని వ్యాఖ్యానించారు.

ప్రజావేదిక కూల్చి ఇంతవరకు శిథిలాలు తీయకుండా పైశాచిక ఆనందం పొందే శాడిస్టు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక డెకాయిట్ మాదిరి వ్యవహరిస్తున్నారన్నారు. బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా వాళ్ళు, బూతుల మంత్రులు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాన్యం కొనుగోళ్లు బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పేదల పాపం జ‌గ‌న్ ని ఊరికే వ‌దిలిపెట్ట‌దు అన్నారు. రైతులకు మద్దతు ధర ఉండటంతో పాటు మార్కెట్ కమిటీలు కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. మీటర్లు వ్యవసాయ మోటర్లకు కాదు మంత్రులకు పెట్టాలని వ్యాఖ్యానించారు. వైసీపీ మంత్రులకు మీటర్లు పెడితే ఏ మంత్రి ఎంత దోచుకుంటున్నారో రియల్ టైమ్‌లో తెలుస్తుందన్నారు. ఫించన్లు పెంచుకుంటూ పోతానని మోసాగిస్తున్నారన్నారు. అప్పుల కోసమే మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు.

పట్టణాల్లో అన్నింటి పైనా పన్నులే అని... పెంపుడు జంతువుల పైనా పన్నులు విధిస్తున్నారని దుయ్యబట్టారు. గాలి రెడ్డి కాబట్టి రేపోమాపో గాలిపైనా పన్ను వేస్తారని యెద్దేవా చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారన్నారు. లక్షా 30వేల కోట్ల అప్పు, 70వేల కోట్ల పన్నులు మోపారని తెలిపారు. ప్రతి ఒక్కరిపై ఇప్పటికే రూ.70వేలు భారం మోపారన్నారు. కుటుంబంలో నలుగురు ఉంటే రూ.2.80లక్షల భారం పడిందని.. ఈ భారం జీవితాంతం మోస్తూ ఊడిగం చేసే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమ‌ర్శించారు.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

   3 hours ago


నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

   8 hours ago


తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

   10 hours ago


అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

   8 hours ago


ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

   11 hours ago


అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

   6 hours ago


వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

   4 hours ago


లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

   12 hours ago


ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

   11 hours ago


ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

   9 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle