newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు

06-03-202106-03-2021 15:37:20 IST
Updated On 06-03-2021 15:43:05 ISTUpdated On 06-03-20212021-03-06T10:07:20.007Z06-03-2021 2021-03-06T10:05:14.067Z - 2021-03-06T10:13:05.047Z - 06-03-2021

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే..! విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇక్కడ ఒక నాయకుడు కష్టకాలంలో మోసం చేశాడని ఆరోపించారు. తాము ఆ నాయకుడికి 2014, 2019లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామని, కానీ ఆ నాయకుడు పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఏంచేశాడో అందరికీ తెలుసని అన్నారు.

అలాంటి అవకాశవాదులను ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తప్పకుండా వచ్చి విశాఖ పాతపట్నం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. విశాఖ మంచివాళ్లు ఉండే నగరం అని, కానీ ఈ నగరాన్ని నేరస్తుల నగరంగా మార్చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వాసుపల్లి గణేశ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాతి కాలంలో వాసుపల్లి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాత గాజువాకలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్లకు ఓట్లు వేస్తే రౌడీయిజానికి లైసెన్స్ ఇచ్చినట్టేనని అన్నారు. రౌడీలు, గూండాలు, నేరస్తులు పెట్రేగిపోతారని, దాడులకు తెగబడతారని.. అలాంటప్పుడు మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరని చంద్రబాబు అన్నారు. వైసీపీ అభ్యర్ధులందరూ నేర చరిత్ర కలిగి ఉన్నారని, నేర చరిత్ర లేకపోతే జగన్ వారికి టిక్కెట్లు ఇవ్వరని చంద్రబాబు అన్నారు. వైసీపీకి ఓట్లు వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు అంగీకరించినట్లు అవుతుందన్నారు.

విశాఖపట్టణానికి పట్టిన ఏ2 శనిని వదిలించుకోవాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ఇక్కడంతా వెనుకబడిన వర్గానికి చెందినవారు ఉన్నారని, ఏ2కు ఇక్కడ ఏంపనని ప్రశ్నించారు. ఇంకా బూతుల మంత్రి ఒకరు, హవాలా మంత్రి ఒకరు, కొబ్బరికాయల మంత్రి ఒకరని విమర్శించారు. మోసాలు చేయడంలో సీఎం జగన్ దిట్టని.. ఈ అరాచక పాలనను అంతమొందించి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనే పోరాటం విశాఖ నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. దోపిడీ రాజ్యం, అరాచకపాలనపై మేధావులు స్పందించి ముందుకు రావాలన్నారు.  జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle