newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

02-12-202002-12-2020 20:12:29 IST
Updated On 03-12-2020 07:35:19 ISTUpdated On 03-12-20202020-12-02T14:42:29.250Z02-12-2020 2020-12-02T14:42:19.796Z - 2020-12-03T02:05:19.412Z - 03-12-2020

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెద్ద పోలవరం గురించి పెద్దగా చర్చ జరిగింది. గత ప్రభుత్వం మీద వైసీపీ నాయకులు ఆరోపణలు చేయగా.. పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించ కుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా? తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారని.. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నవారు... దాన్ని ఎందుకు నిరూపించలేకపోయారని ఎదురుదాడికి దిగారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి నష్టం చేకూర్చారని.. తాము వేసిన అంచనాలను తప్పుపట్టిన వాళ్లు.. ఇప్పుడు అవే అంచనాలను కరెక్ట్ అంచనాలని చెప్పుకుంటున్నారని అన్నారు. ఈ ప్రశ్నలు అడిగితే తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు.

జగన్ అవినీతిపరుడు కాబట్టి అందరిపై అవినీతి ముద్ర వేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. గోదావరి నీళ్లను తెలంగాణ మీదుగా శ్రీశైలానికి తెస్తామని జగన్ చెప్పినప్పుడు అది కుదిరే పని కాదని తాను చెప్పానని తాను చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చిందన్నారు టీడీపీ అధినేత. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం ప్రాజెక్టును కడుతూ, అక్కడ వైయస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా అని విమర్శించారు. వైయస్ విగ్రహం పెడితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. 

అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని.. డ్యామ్ ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గంచబోమని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు తప్పకుండా నిర్మిస్తామని అన్నారు. నిర్ణీత సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా.. అక్కడ 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

   an hour ago


కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   2 hours ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   2 hours ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   7 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   8 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   10 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   10 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   11 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   12 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   12 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle