newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

చంద్రబాబు మీద దాడి.. పక్కా ప్లాన్ తోనే చేశారా..?

13-04-202113-04-2021 12:16:36 IST
Updated On 13-04-2021 10:23:25 ISTUpdated On 13-04-20212021-04-13T06:46:36.036Z13-04-2021 2021-04-13T04:45:38.471Z - 2021-04-13T04:53:25.593Z - 13-04-2021

చంద్రబాబు మీద దాడి.. పక్కా ప్లాన్ తోనే చేశారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో వున్న చంద్రబాబుపై దుండగులు రాళ్ళ దాడికి యత్నించారు. దీంతో రోడ్ షో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. చంద్రబాబు రోడ్ షోలో ప్రసంగిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆపై ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. తన రోడ్ షోలో జరిగిన రాళ్ల దాడిని చంద్రబాబు ఎస్పీకి వివరించారు. ఎస్పీకి ఫిర్యాదు అనంతరం చంద్రబాబు నిరసన విరమించారు.

టీడీపీ సభపై జరిగిన రాళ్ల దాడి రాజకీయ కుట్ర అని ఆరోపించారు. టీడీపీ నేతలపై ప్రణాళిక ప్రకారం దాడి చేశారని వెల్లడించారు. టీడీపీని లేకుండా చేయాలని వైసీపీ దుష్ట పన్నాగాలకు పాల్పడుతోందని అన్నారు. రాళ్ల దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరిస్తారని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది నిష్పాక్షికంగా వ్యవహరించాలని, పోలీసులు సీఈసీ పరిధిలో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. 

ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తకు గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే, చంద్రబాబు ప్రచార వాహనం దిగి, కార్యకర్తక తగిలిన గాయంపై వాకబు చేశారు. పోలీసులు సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనీ, వైసీపీ గూండాలు తమ ఎన్నికల ప్రచారంపై దాడి చేయడం దుర్మార్గమని చంద్రబాబు విమర్శించారు. తన సొంత జిల్లాలోనే తన మీద దాడి చేసే ధైర్యం దుండగులకు ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. దాడికి దుండగులు ముందస్తు వ్యూహం రచించుకున్నారనీ, ప్రతిపక్ష నేత నిర్వహిస్తోన్న ఎన్నికల ప్రచార సభకు ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు.

చరిత్ర హీనుడిగా మిగలిపోవద్దని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సూచిస్తున్నా.. ప్రజాస్వామ్యంలో దాడులకు అవకాశమే వుండకూడదు అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రచార వాహనంపై రాళ్ల దాడి జరగడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. ఈ ఘటనలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించాలని వారు నిర్ణయించుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నేతృత్వంలో టీడీపీ నేతల బృందం గవర్నర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరింది. జడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ చంద్రబాబుపై తిరుపతిలో రాళ్లదాడికి యత్నించడం పట్ల టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   4 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   8 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle