newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

23-01-202123-01-2021 22:09:24 IST
Updated On 23-01-2021 15:04:53 ISTUpdated On 23-01-20212021-01-23T16:39:24.541Z23-01-2021 2021-01-23T09:12:22.786Z - 2021-01-23T09:34:53.605Z - 23-01-2021

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుప్రీంకి వెళ్ల‌డానికి ఏపీ స‌ర్కార్ రెడీ అవుతున్నా ప‌ట్టించుకోకుండా.. నోటిఫికేష‌న్ రిలీజ్ చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ ర‌మేశ్ కుమార్. నాలుగు ద‌శ‌ల్లో ఏపీ పంచాయితీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. విజ‌య‌వాడ‌లోని ఎస్ఈసీ ఆఫీస్ లో మీడియా స‌మావేశంలో ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల తొలివిడ‌త నోటిఫికేష‌న్ రిలీజ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు నిర్ణ‌యం వ్యతిరేకంగా వ‌స్తే  పాటిస్తాం అని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నిక‌లు రెవెన్యూ డివిజ‌న్ ప్ర‌కారంగానే జ‌ర‌గున్నాయి. నాలుగు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా.. తొలి ద‌శ‌లో విజ‌య‌న‌గ‌రం, ప్ర‌కాశం జిల్లాల్లో త‌ప్ప‌ మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని చెప్పారు ర‌మేశ్ కుమార్.

నిమ్మ‌గ‌డ్డ మాట్లాడుతూ తాము అన్ని నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ముందుకు వెళ్తున్నామ‌ని.. రాజ్యాంగాన్ని ర‌చించిన అంబేద్క‌ర్ మాన‌స‌పుత్రికే ఎన్నిక‌ల సంఘం అని ఆయ‌న అన్నారు. దాని ప్ర‌కార‌మే ఎన్నిక‌లు స‌కాలంలో నిర్వ‌హించ‌డ‌మ‌నేది ఎన్నిక‌ల క‌మిష‌న్ విధి అని చెప్పుకొచ్చారు. అందుకే తాము ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించి ముందుకు వెళ్తున్నామ‌ని.. కొంద‌రు ప్ర‌భుత్వ‌ అధికారులు మాత్రం ఎన్నిక‌ల ప్ర‌క్రియను స‌మ‌ర్థంగా కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని అన్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఏపీ ప్ర‌భుత్వం నుంచి మిశ్ర‌మ అనుభ‌వాలు ఉన్నాయ‌ని చెప్పారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో స‌మావేశంలో పాల్గొనాల‌ని సీఎస్‌, పంచాయ‌తీ రాజ్ ముఖ్య కార్య‌ద‌ర్శి హాజ‌రు కావాల‌ని కోరామ‌ని తెలిపారు. వారు అందుకు హాజ‌రు కాలేద‌ని తెలిపారు. స‌రైన స‌మ‌యంలో స‌రైన రీతిలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఏదేమైనా స‌రైన స‌మ‌యానికి ఎన్నిక‌లు జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు తమ శ్రేణులను టీడీపీ అధినేత చంద్రబాబు సమాయత్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ పతనానికి ఈ పంచాయతీ ఎన్నికలే నాంది కావాలని చంద్రబాబు పిలుపును ఇచ్చారు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీ రౌడీ రాజ్యానికి ముక్కుతాడు వేయాలని.. అన్ని పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండాలని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కోవాలని బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలని చెప్పారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అన్నారు. వైసీపీ నేతల దౌర్జన్యాలను సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి, అధికారులకు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చంద్రబాబు సూచించారు. ప్రజల్లో వైసీపీ పట్ల చాలా వ్యతిరేకత ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం వైసీపీలో ఉందని అన్నారు.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్

   2 hours ago


బీజేపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్.. భార్య ఒత్తిడే కార‌ణ‌మా

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్.. భార్య ఒత్తిడే కార‌ణ‌మా

   2 hours ago


విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ స‌ర్కార్ కు ముందే తెలుసు

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ స‌ర్కార్ కు ముందే తెలుసు

   4 hours ago


నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

   19 hours ago


కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

   21 hours ago


కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

   a day ago


వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

   a day ago


ఇదేం  అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

ఇదేం అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

   a day ago


దేశ వ్యాప్తంగా ఆ నియోజ‌క వ‌ర్గం గెలుపు పై ఫోక‌స్

దేశ వ్యాప్తంగా ఆ నియోజ‌క వ‌ర్గం గెలుపు పై ఫోక‌స్

   12 hours ago


రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle