చంద్రబాబు చాణక్యమే సరైనదా..?
07-04-202107-04-2021 13:11:54 IST
Updated On 07-04-2021 11:42:33 ISTUpdated On 07-04-20212021-04-07T07:41:54.437Z07-04-2021 2021-04-07T05:29:23.778Z - 2021-04-07T06:12:33.119Z - 07-04-2021

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పరిషత్ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయం అని.. వైసీపీ ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరైనదేనని రుజువైందని తెలిపారు. ఎస్ఈసీ చట్టప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారకూడదని చంద్రబాబు హితవు పలికారు. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటిందని, కొత్త ఓటర్లకు కూడా అవకాశం ఇచ్చేలా తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు. ఎన్నికల కోడ్ వ్యవధి నాలుగు వారాలు ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని, అయితే, సుప్రీం మార్గదర్శకాలను పట్టించుకోకుండా హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని పలువురు టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్నికలకు వెళ్లకుండా తీసుకున్న నిర్ణయమే సరైనదని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఏపీలో ఈ నెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ఇటీవల కొత్తగా ఎస్ఈసీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కోడ్ విషయంలో నాలుగు వారాల గడువు పాటించలేదని పిటిషనర్లు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్ విధించలేదని.. ఎస్ఈసీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. విచారణ సందర్భంగా పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడం సరికాదని ధర్మాసనం తెలిపింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కనీసం 4 వారాల సమయం అవసరమని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పిటిషనర్లు కోర్టు ముందుంచారు. ఇది గతంలోనే ఇచ్చిన నోటిఫికేషన్ అని, కొవిడ్ వల్ల ఆగిపోయిందని, దాన్నే కొనసాగిస్తున్నామని ఎస్ఈసీ, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నందున వాటిని అతిక్రమించరాదని జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం ఎస్ఈసీకి, ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా