newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

స్టీల్ ప్లాంట్ ను కాపాడ్డానికి..అంద‌రం క‌లిసి రాజీనామా చేద్దామా జ‌గ‌న్

17-02-202117-02-2021 08:55:17 IST
Updated On 17-02-2021 10:17:16 ISTUpdated On 17-02-20212021-02-17T03:25:17.068Z17-02-2021 2021-02-17T01:58:05.117Z - 2021-02-17T04:47:16.115Z - 17-02-2021

స్టీల్ ప్లాంట్ ను కాపాడ్డానికి..అంద‌రం క‌లిసి రాజీనామా చేద్దామా జ‌గ‌న్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్టీల్ ప్లాంట్ ఎవ్వారం ఏపీలో ఏ రేంజ్ పొలిటిక‌ల్ గా మారిందో తెలిసిందే క‌దా. కొంత‌మంది సీరియ‌స్ గా ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడ్డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటే కొంత‌మంది మాత్రం.. ఓ వైపు అమ్మ‌డానికి స‌పోర్ట్ చేస్తూనే.. పైకి మాత్రం.. క‌ప‌ట క‌థ‌లు ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈటైంలో.. టీడీపీ మాత్రం సీరియ‌స్ గా తీసుకుంది. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేట్ ప‌రం చేస్తే ఊరుకునే ప్ర‌స‌క్తే లేదంటున్నారు టీడీపీ లీడ‌ర్లు.

ఆల్రెడీ టీడీపీ లీడ‌ర్లు.. దీక్ష‌లు, రాజీనామాల‌కి రెడీ అయ్యారు. వైసీపీ మాత్రం డ్రామాలు ఆడుతుంద‌ని.. అంద‌రూ ఆరోపిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా.. ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై సీరియ‌స్ గా ఉన్నారు. వైసీపీ, కేంద్ర ప్ర‌భుత్వం క‌లిసి.. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను విశాఖ‌కు కాకుండా చేయాల‌ని చూడ్డంపై మండిప‌డుతున్నారు. పైపై నాట‌కాలు కాదు.. సీరియ‌స్ రంగంలోకి దిగాల‌ని.. వైసీపీని డిమాండ్ చేస్తున్నారు చంద్ర‌బాబు. సీఎం జ‌గ‌న్ కూడా.. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడ్డానికి ముందుకు రావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌త్య‌క్ష పోరాటాల‌కి రెడీ అవుతున్నారు చంద్ర‌బాబు.

అంతే కాకుండా... ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడే విష‌యంలో ఎవ‌రితో క‌లిసి న‌డ‌వడానికి అయినా తాను రెడీ అంటున్నారు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు. సీఎం జ‌గ‌న్ తో... వైసీపీ లీడ‌ర్ల‌తో ఎవ‌రితో అయినా క‌లిసి ముందుకెళ్తా అంటున్నారు. వైసీపీ లీడ‌ర్లు కూడా రాజీనామాకి రెడీ కావాల‌న్నారు చంద్ర‌బాబు. ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ ఏం చేద్దాం అంటే అది చేద్దాం.. నేను రెడీ అన్నారు చంద్ర‌బాబు నాయుడు. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడే విష‌యంలో.. మిగ‌తా వారి కంటే ప్ర‌భుత్వంపైనే ఎక్కువ బాధ్య‌త ఉంద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు.

ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కాపాడాల‌ని.. ప్రైవేటీ క‌ర‌ణ‌ను ఆపేయాల‌ని.. టీడీపీ లీడ‌ర్ చేస్తున్న ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న ప‌ల్లా శ్రీనివాస‌రావుకు సంఘీ భావం తెలిపి.. ఆయ‌న‌కు నిమ్మ‌రసం ఇచ్చి.. దీక్ష విర‌మించ జేశారు చంద్ర‌బాబు నాయుడు. అలాగే.. విశాఖ ఉక్కు ఫ్రంట్ గేట్ ద‌గ్గ‌ర దీక్ష‌లు చేస్తున్న అఖిల పక్షాల దీక్ష‌ల ద‌గ్గ‌రికి చేరుకున్న చంద్ర‌బాబు వారికి మ‌ద్ద‌తు తెలిపారు. వారికి త‌న స‌పోర్ట్ హండ్ర‌డ్ ప‌ర్సంట్ ఉంటుంది అని భ‌రోసా ఇచ్చారు బాబు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle