newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

14-05-202114-05-2021 12:40:07 IST
Updated On 14-05-2021 08:34:51 ISTUpdated On 14-05-20212021-05-14T07:10:07.088Z14-05-2021 2021-05-14T02:53:08.628Z - 2021-05-14T03:04:51.175Z - 14-05-2021

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై వరుసగా కేసులు పెడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్... ఇలా పలువురు టీడీపీ నేతల మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇవన్నీ రాజకీయ కక్షతో చేసినవేనంటూ టీడీపీ ఆరోపిస్తూ ఉంది. తాజాగా ఈ అక్రమ కేసులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల కన్నా ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులే ఎక్కువగా ఉంటున్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు. ఫిర్యాదు ఇవ్వడానికి గుంటూరులో ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళిన టీడీపీ నేతలపై కరోనా నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు చేయడం దారుణమని.. వైసీపీ నేతలు చెప్పినట్లు ఆడుతూ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు మున్ముందు వాటికి మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌440కే మ్యూటెంట్‌ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుందంటూ మీడియాలో మంత్రి అప్పలరాజు చేసిన ప్రకటనపై టీడీపీ నేతలు బుధవారం గుంటూరులోని అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గుంపులుగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారని, కరోనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ గుంటూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ సహా పలువురిపై సెక్షన్‌లు 188, 269 ప్రకారం కేసు నమోదు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన టీకాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారంటూ ఏపీ మంత్రులు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే..! బంధుత్వం ఉంది కాబట్టి భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లాతో చంద్రబాబు మాట్లాడి రాష్ట్రానికి వ్యాక్సిన్లు ఇప్పించాలని ఏపీ మంత్రులు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు. టీకాల గురించి వారిని అడుక్కోవడమేంటని, వారిని లాక్కొచ్చి సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే మొత్తం కంపెనీలనే రాసిచ్చేయరూ.. అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.

మన ఏసీబీ, సీఐడీని పంపి సంగం డెయిరీని స్వాధీనం చేసుకుని అమూల్‌కు అప్పజెప్పినట్టే భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్‌లను స్వాధీనం చేసుకోవడం కుదరదంటారా, జగన్ గారూ? అని అయ్యన్న ప్రశ్నించారు. మన ఏసీబీ, సీఐడీలను పంపించి కృష్ణా ఎల్లా, పూనావాలను ఎత్తుకు రాలేరా? అని అన్నారు. ఉత్తరం రాసినా వ్యాక్సిన్లు ఇవ్వడం లేదంటూ ఆ రెండు సంస్థల యజమానులపైనా కర్నూలు, కడప పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టించి వారిని పట్టుకు రావొచ్చు కదా? అని సలహా ఇచ్చారు. వారిని తీసుకొచ్చి సీఐడీ ఆఫీసులో రోజుకు 9 గంటలు కూర్చోబెడితే వారే తమ కంపెనీలను రాసిచ్చి వెళ్లిపోతారని, టీకాల గురించి వారిని అడుక్కోవడమేంటని అయ్యన్న వ్యంగ్యాస్త్రాలను సంధించారు. 

తిరుపతి రుయా ఘటన.. ప్రభుత్వ హత్యలే అంటూ..!

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   3 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   7 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle