రామతీర్థం ఘటన.. చంద్రబాబుతో సహా వారిపై కేసులు
04-01-202104-01-2021 12:14:15 IST
Updated On 04-01-2021 12:27:31 ISTUpdated On 04-01-20212021-01-04T06:44:15.074Z04-01-2021 2021-01-04T06:44:09.338Z - 2021-01-04T06:57:31.313Z - 04-01-2021

విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన ఎంతో వివాదాస్పదం అయింది. విజయ నగరం జిల్లా నెల్లిమర్లలోని రామతీర్థంలో ధ్వంసమైన కోదండరాముడి విగ్రహ శిరస్సు భాగాన్ని కొందరు ధ్వంసం చేశారు. కొండపై ఉన్న రామకొలనులో శిరస్సు లభించింది. విగ్రహం ధ్వంసంపై విచారణ చేపట్టిన పోలీసులు రెండు రోజులుగా గాలించారు. డాగ్ స్క్వాడ్ కొలను చుట్టూ తిరగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా విగ్రహ శిరస్సు భాగం దొరికిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇటీవలే పలు పార్టీల నేతలు రామతీర్థంలో పర్యటించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అక్కడ పర్యటించారు. విజయసాయి రెడ్డి రామతీర్థాన్ని సందర్శించగా.. ఆయనపైకి బీజేపీ, టీడీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లు విసిరారు. ఆయన వేరే వాహనంలో అక్కడి నుంచి బయల్దేరారు. విజయసాయిరెడ్డి బోడికొండకు చేరుకుని, రామతీర్థంకు చేరుకునే సమయానికే అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామతీర్థంకు వెళ్తున్న సమయంలోనే విజయసాయిని బీజేపీ, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కొండపైకి వెళ్లే అర్హత విజయసాయికి లేదని వారు మండిపడ్డారు. గోబ్యాక్ విజయసాయిరెడ్డీ అంటూ.. జైశ్రీరాం నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. పోలీసుల అండతో విజయసాయిరెడ్డి కొండపైకి వెళ్లారు. ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కేసు నమోదైంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై జరిగిన రాళ్ల దాడికి చంద్రబాబే కారణమని, ఆయనే ఆ దాడి చేయించారంటూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులపైనా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపైనా పీడీపీపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. ఎంపీ విజయసాయిరెడ్డిపై జరిగిన దాడి ఘటనలోనూ కేసు నమోదు చేశామని అన్నారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ రామతీర్థంలో పర్యటించిన సందర్భంగా ఎస్పీ రాజకుమారి కూడా అక్కడికి వచ్చారు.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
3 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
4 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
6 hours ago

దేవినేని ఉమ విడుదల..!
8 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
8 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
8 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
11 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
12 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
14 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
15 hours ago
ఇంకా