పసలేని పరిషత్ ఎన్నికలు..ముచ్చటగా మూడు కారణాలు
08-04-202108-04-2021 10:29:21 IST
2021-04-08T04:59:21.788Z08-04-2021 2021-04-08T04:58:55.461Z - - 16-04-2021

గట్టిగా మాట్లాడితే గ్రామాల్లోనే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఉంటయ్. అరుగుల మీద జరిగే డిస్కషన్లు ఏ టీవీ ఛానల్ లోనూ జరగవు. అంత క్లారిటీగా అంత పోటా పోటీగా ఉంటయ్. కొన్ని చోట్ల కొట్టుకునేదాకా వెళ్తారు. అఫ్ కోర్స్.. టీవీ డిస్కషన్లలో అయితే.. చెప్పులు తీసుకుని బాదేస్తున్నారు ఈ మధ్య అది వేరే విషయం అనుకోండి.
అయితే.. ఈసారి పరిషత్ ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా నడుస్తున్నాయి. ఎందుకంటే అసలు జనాలే లేకపోతే ప్రశాంతంగా నడవక ఎలా నడుస్తయ్ చెప్పండి. ముందుగా ఈ ఎన్నికలను టీడీపీ బాయ్ కాట్ చేసింది. పద్దతిగా నడవడ లేదు అనేది టీడీపీ ఇంటెన్షన్. సో టీడీపీ సైలెంట్ అయింది. ప్రధాన ప్రతి పక్షమే వ్యతిరేకించినప్పుడు ఇక ఎన్నికల్లో మజా ఏం ఉంటుంది చెప్పండి. కొన్ని చోట్ల కొంతమంది కన్ ఫ్యూజన్ లో పోటీకి దిగినా.. వాళ్లు కూడా యాక్టివ్ గా లేరు. అధిష్టానం నిర్ణయం ప్రకారం సైలెంట్ అయిపోయారు.
మరో రీజన్ ఈ ఎన్నికలు.. కోర్టు కేసులు అని మామూలు ఎవ్వారాలు కాదు. నిన్నటి దాకా నిన్న సాయంత్రం దాకా.. అధికారులకే క్లారిటీ లేదు. ఎన్నికలు జరుగుతాయా లేవా అంటే.. ఎవరికీ ఏమీ తెలీదు. ఆఫీసర్లు కూడా మూవ్ అవ్వాలా వద్దా అన్నట్లు ఉండిపోయారు. జనం కూడా ఎన్నికలు లేవనే అనుకున్నారు. ఎన్నికలు ఉన్నాయి.. ఓటేయాలి అనే విషయం జనాల్లోకి సరిగా వెళ్లలేదు.
ఇంకో రీజన్ కూడా ఉంది. ఇప్పటి నుంచా చెప్పండి. ఏపీలో ఎన్నికల వెదర్ చానాళ్ల నుంచీ ఉంది. పంచాయితీ ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికలు.. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు.. మళ్లీ జరగనున్న తిరుపతి ఎన్నికలు.. జనాలకి కిక్కు పోయింది. మామూలుగా ఎన్నికలు అంటే.. ఆ హడావిడి వేరే ఉంటుంది. కానీ.. ఎన్నాళ్లని హడావిడి ఉంటుంది చెప్పండి. ప్రచారం చేసే వారితో పాటు.. ఓట్లేసేవారికి కూడా నీరసం వచ్చినట్లే ఉంది. పైగా ఎండలు కూడా.. పొద్దున్నే తొమ్మిదింటి నుంచే బాదేస్తున్నాయి. అందుకే.. ఇప్పటికే రెండు సార్లు వేశాం.. మన ఓటు హక్కు ఎక్కడికీ పోదులే అనుకునే వాళ్లు ఎంత మంది లేరు చెప్పండి.

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
25 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
15 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
11 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
18 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
21 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా