newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

06-03-202106-03-2021 15:43:39 IST
Updated On 06-03-2021 14:45:34 ISTUpdated On 06-03-20212021-03-06T10:13:39.280Z06-03-2021 2021-03-06T08:39:55.323Z - 2021-03-06T09:15:34.985Z - 06-03-2021

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయవాడ తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. కేశినేని నానిపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కేశినేని నానితో గత కొన్ని రోజులుగా విసిగిపోయామని.. విధిలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును కేశినేని ఏక వచనంతో సంబోధించడం శోచనీయమని..  తాను విజయవాడకే అధిష్ఠానం అని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు దురంహంకారాన్ని సూచిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేశినేని అహంకారాన్ని చూసి ఆరోజు తాను చెప్పుతో కొట్టాలనుకున్నానని.. చంద్రబాబు మీద ఉన్న గౌరవంతో ఆ పని చేయలేదని బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా హత్య కేసులో ఉన్న ముద్దాయిని కేశినేని ప్రచారంలో తిప్పుతున్నారని.. కేశినేని నాని స్థాయి దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 'దమ్ముంటే రా.. తేల్చుకుందాం' అంటూ కేశినేనికి సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీకి బీసీలను దూరం చేస్తున్నాడంటూ కేశినేనిపై మండిపడ్డారు. 

పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా నివాసంలో సమావేశమైన నేతలు ఎంపీ నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బొండా ఉమా కూడా కేశినేని నానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..! బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ కేశినేని మాట తీరు సరిగాలేదని.. ప్రజారాజ్యంలో ఇదే తరహాలో వ్యవహరించి బయటకు గెంటించుకున్నారన్నారు. విజయవాడ టీడీపీకి తానే అధిష్ఠానమని కేశినేని మాట్లాడడం సరికాదని.. ఇది ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.

తన కూతురుని మేయర్ చేయడం కోసం ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపారన్నారు. కులాలమధ్య, పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని.. వర్గాలను,విభేదాలను కేశినేని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు చేశారు బొండా ఉమా. బెజవాడ పార్లమెంట్‌లో కేశినేనికి సత్తా ఉంటే... రాజీనామా చేసి... ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలన్నారు. టీడీపీ సింబల్, చంద్రబాబును చూసి నీకు ఓట్లు వేశారని.. నాని ఇండిపెండెంట్‌గా గెలిచి చూపిస్తే... కట్టుబట్టలతో విజయవాడ వదిలివెళ్లిపోతానని సవాల్ చేశారు. నాని ముఖ్యం అనుకుంటే తాము రేపు జరుగబోయే చంద్రబాబు టూర్‌కు దూరంగా ఉంటామని హెచ్చరించారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   16 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle