newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

10-04-202110-04-2021 11:24:19 IST
Updated On 10-04-2021 11:54:56 ISTUpdated On 10-04-20212021-04-10T05:54:19.235Z10-04-2021 2021-04-10T05:53:37.865Z - 2021-04-10T06:24:56.235Z - 10-04-2021

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సారొస్తారొస్తారు.. వ‌స్తారొస్తారొస్తారే అంటూ.. బీజేపీ లీడ‌ర్లు.. ఏపీలో ఏవేవో కూని రాగాలు తీయ‌డ‌మే త‌ప్ప‌.. చేస్తున్న‌దేమీ లేదంటున్నారు తిరుప‌తి పొలిటిక‌ల్ అన‌లిస్టులు. ఏపీలో రాజ‌కీయం ఎంత హీటెక్కిందో తెలిసిందే క‌దా. అధికార పార్టీ ఇద్ద‌రు ముగ్గురు మంత్రులు త‌ప్ప‌.. అంద‌రినీ రంగంలోకి దింపింది. మంత్రులే కాదు.. మిగ‌తా లీడ‌ర్లు కూడా చేరిపోయారు. ఫేమ్ ఉన్న ప్ర‌తి లీడ‌రూ.. ప్ర‌చారం చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తిరుప‌తి ఎంపీ సీటుని చేజారనివ్వ‌డానికి వీళ్లేదు అనుకుంటున్నారు.

ఇక టీడీపీ కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఆయ‌న కుమారుడు లోకేశ్ జ‌నంలోనే ఉంటున్నారు. మిగిలిన టీడీపీ లీడ‌ర్లు కూడా తిరుప‌తి విజ‌యం పై ఫోక‌స్ చేశారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాలి అని ప‌ట్టుమీదుంది టీడీపీ. వ్యూహాలు ర‌చిస్తూ ముందుకెళ్తున్నారు చంద్ర‌బాబు. ముందే పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు నాయుడు.. ఎలాగైనా స‌రే.. గెలిచి తీరాలి అని కంక‌ణం క‌ట్టుకున్నారు.

రెండు పార్టీల మ‌ధ్య నువ్వా నేనా అన్న‌ట్లు ఎవ్వారం న‌డుస్తుంటే.. బీజేపీ మాత్రం ఏదో మ‌మ అనే పాలిటిక్స్ చేస్తోంది. మొన్నా మ‌ధ్య ఓ పూట ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చి వెళ్లారు. అంతే. ఇక జాతీయ స్థాయి లీడ‌ర్ల‌పైనే ఫోక‌స్ చేసింది బీజేపీ. ఎవ‌రైనా వ‌స్తారేమో వ‌స్తారేమో అంటూ ఆశ‌గా చూస్తున్నారు లీడ‌ర్లు. జ‌న‌సేనాని క‌లిసినా.. జ‌న‌సేన మాత్రం బీజేపీతో క‌ల‌వ‌క‌పోవ‌డంతో కూడా బీజేపీకి ఎటూ పాలుపోవ‌డం లేద‌ట‌. వ‌చ్చిన జాతీయ స్థాయి లీడ‌ర్ల‌కి కూడా లోక‌ల్ గా ఎలాంటి ఫేమూ లేదు.

సో.. ఫేమ్ ఉన్న లీడ‌ర్లు వ‌చ్చి గ‌ట్టెక్కిస్తారేమో అని చూస్తోందంట బీజేపీ. ఇప్ప‌టి వ‌రకూ ఒక నియోజ‌క వ‌ర్గాన్ని మాత్ర‌మే క‌వ‌ర్ చేసిన బీజేపీ.. రెండో నియోజ‌క వ‌ర్గాన్ని కూడా కంప్లీట్ చేయ‌లేదు. ఇక ప్ర‌చారానికి ఐదు రోజులే టైం ఉంది. మ‌రి ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో.. ఢిల్లీ నుంచి ఏ లీడ‌ర్ వ‌చ్చి.. ఏపీ బీజేపీని కాపాడుతారో చూడాలి.

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   9 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   20 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle